NewsOrbit
న్యూస్

సెప్టెంబ‌ర్ నెల‌లో చోటు చేసుకోనున్న 5 ముఖ్య‌మైన మార్పులు ఇవే..?

సెప్టెంబ‌ర్ 1 వ‌చ్చేస్తోంది. అందులో భాగంగా చోటు చేసుకోనున్న ప‌లు మార్పులు ప్ర‌జ‌ల ఆర్థిక అవ‌స‌రాల‌పై ప్ర‌భావం చూపించ‌నున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు రూల్స్ ను మారుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 కూడా మొద‌లుకానుంది. అయితే ఆ రోజు నుంచి చోటు చేసుకోనున్న 5 ముఖ్య‌మైన మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

from september these 5 important changes might occur

1. క‌రోనా నేప‌థ్యంలో ఆర్థిక స‌మ‌స్య‌ల బారిన ప‌డ్డ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఆర్‌బీఐ మార్చి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా ఈఎంఐ మార‌టోరియం స‌దుపాయం క‌ల్పించింది. అయితే ఇప్పుడు ఆగస్టు ముగుస్తోంది. సెప్టెంబ‌ర్ వ‌స్తోంది. కానీ మార‌టోరియాన్ని మాత్రం పొడిగించ‌లేదు. అందువ‌ల్ల సెప్టెంబ‌ర్ నెల నుంచి జ‌నాలు ఎప్ప‌టిలా ఈఎంఐలు చెల్లించాల్సి వ‌స్తుంది. క‌నుక ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లను ఎదుర్కొన‌వ‌చ్చు.

2. అన్‌లాక్ 4.0 నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 7 నుంచి మెట్రో రైళ్ల‌ను ఆప‌రేట్ చేసేందుకు అనుమ‌తులు ఇచ్చారు. ద‌శ‌ల‌వారీగా మెట్రో రైళ్ల‌ను ప్రారంభిస్తారు. కానీ ఆ రైళ్ల‌లో ప్ర‌యాణించే వారు చాలా జాగ్రత్త‌గా ఉండాలి.

3. ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను ప్ర‌తి నెలా మారుస్తున్నారు. అయితే సెప్టెంబ‌ర్ 1 నుంచి ఆ ధ‌ర‌లు త‌గ్గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు కొంత వ‌ర‌కు ఊర‌ట క‌లిగించేందుకు వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తార‌ని తెలిసింది.

4. క‌రోనా నేప‌థ్యంలో విమాన‌యాన కంపెనీల‌కు తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లింది. అంత‌ర్జాతీయ స‌ర్వీసులు ఇప్ప‌ట్లో ప్రారంభం అయ్యే అవ‌కాశం లేదు. అయితే దేశీయ‌, అంత‌ర్జాతీయ విమాన సర్వీసుల్లో టిక్కెట్లు, ఇత‌ర చార్జిల‌ను భారీగా పెంచ‌నున్న‌ట్లు తెలిసింది. ఆ పెంపు సెప్టెంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని స‌మాచారం.

5. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో మార్చి చివ‌రి నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సుల‌ను మూసివేశారు. కానీ అన్‌లాక్ 4.0 లో భాగంగా సెప్టెంబ‌ర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇచ్చారు. అందువ‌ల్ల జ‌నాలు ఆయా ప్ర‌దేశాల్లో మూవీల‌ను చూసేందుకు అవ‌కాశం క‌లుగుతుంది.

author avatar
Srikanth A

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !