NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గోపాల‌పురంలో ‘ మ‌ద్దిపాటి ‘ పై ఫుల్ క్లారిటీ… లేటెస్ట్ స‌ర్వేలేం చెప్పాయంటే…!

ఏపీలో ఎన్నిక‌ల వేడి.. పొత్తుల హ‌డావిడితో తెలుగుదేశం జోరు మామూలుగా లేదు. పార్టీ నుంచి ఇప్ప‌టికే తొలి జాబితా వెలువ‌డింది. అయితే అధినేత చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చినా, పార్టీకి బ‌ల‌మైన నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని తొలి జాబితాలో లేవు. ఇక రెండో జాబితా రెండు మూడు రోజుల్లో వెలువ‌డుతుండ‌డంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఏపీ అంత‌టా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వేలు జ‌రుగుతున్నాయి.

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గోపాల‌పురం సీటు విష‌యంలో బాబు ఇప్ప‌టికే రెండుసార్లు క్లారిటీ ఇచ్చినా తాజాగా ప్ర‌క‌ట‌న‌కు ముందు మ‌రోసారి స‌ర్వేలు చేయించారు. గోపాల‌పురం సీటు విష‌యంలో ఎన్నిసార్లు స‌ర్వేలు జ‌రుగుతున్నా వెంక‌ట్రాజుకు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్ నుంచి భారీగా అనుకూల‌త ల‌భిస్తోంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో జ‌రిగిన ప‌లు స‌ర్వేల్లో ఇదే తేల‌గా.. తాజా అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు మ‌రోసారి చేసిన‌ స‌ర్వేలో మ‌ద్దిపాటికే గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ టీడీపీ కేడ‌ర్ జై కొట్టింది.

ఇక యేడాదిన్న‌ర కాలంగా గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మ‌ద్దిపాటి పార్టీ కేడ‌ర్‌తో మ‌మేక‌మై కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్టం చేస్తూ వ‌చ్చారు. అంత‌కుముందు దొండ‌పూడి స‌భ‌లో గోపాల‌పురం టిక్కెట్ మ‌ద్దిపాటిదే అని చెప్పిన చంద్ర‌బాబు.. దేవ‌ర‌ప‌ల్లి స‌భ‌లోనూ వెంక‌ట్రాజును ఆశీర్వ‌దించాల‌ని స్ఫ‌ష్టం చేశారు. అయినా తొలి జాబితాలో మ‌ద్దిపాటి పేరు లేక‌పోవ‌డంతో కొంత ఉత్కంఠ నెల‌కొంది. తాజా స‌ర్వేల‌లో కేవ‌లం పార్టీ కేడ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో సామాన్య ప్ర‌జ‌ల నుంచి కూడా చాలా సానుకూల‌త ఉంద‌ని తేలింద‌ని.. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

దీంతో రెండో జాబితాలో మ‌ద్దిపాటి పేరు ఉంటుంద‌న్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అటు మ‌ద్దిపాటి మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం విస్తృతం చేస్తుండ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్‌తో ప్ర‌తిరోజు గ్రూప్‌కాల్స్ ద్వారా ప‌క్కా ప్లానింగ్‌తో, చాలా ఎలెర్ట్‌గా ఉంటూ దూసుకు వెళుతున్నారు. మ‌ద్దిపాటి నియోజ‌క‌వ‌ర్గం అంతా… అన్ని గ్రామాల్లో క్షేత్ర‌స్థాయిలోకి ప్ర‌తి వ‌ర్గంలోకి దూసుకుపోయారు. అటు వైసీపీ నుంచి హోం మంత్రి తానేటి వ‌నిత పోటీ చేస్తుండ‌డంతో ఆమెను ఢీ కొట్టి గెలిచేందుకు యువ‌నేత‌గా ఉన్న మ‌ద్దిపాటి అయితేనే క‌రెక్ట్ అన్న టాక్ టీడీపీ కేడ‌ర్ నుంచే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గంలో కామ‌న్ పీపుల్ నుంచి కూడా వినిపిస్తోంది.

వైసీపీ కూడా మ‌ద్దిపాటి దూకుడుకు కంగారు ప‌డే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంక‌ట్రావును కొవ్వూరుకు మార్చేసి ఏకంగా హోం మంత్రిని దింపింది. అయితే ఇప్పుడు కూడా వెంక‌ట్రాజు గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుండ‌డంతో అధికార పార్టీ మ‌రింత కంగారెత్తుతోన్న ప‌రిస్థితి. ఏదేమైనా గోపాల‌పురంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే టీడీపీ వేవ్ గ‌ట్టిగా క‌నిపిస్తోంది. అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న వ‌స్తే టీడీపీలో జోష్‌కు బ్రేకులే ఉండ‌వ్ అన్న‌ట్టుగా ఉంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju