Galli Sampath : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు , లవ్లీ సింగ్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం గాలి సంపత్..!! అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.. ఇదే రోజున వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..! మరి మిగతా సినిమాలకు ఈ సినిమా పోటీ ఇవ్వనుందా..!! ఈ సినిమా పూర్తి టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.. గాలి సంపత్ మొత్తం మీద 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 7 కోట్లు అవ్వగా.. 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రావడం విశేషమే మరి..!! ఇది శ్రీ విష్ణు కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు..! ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 7కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాలి..!
గాలి సంపత్ మూవీ నైజాం ఏరియా లో 141 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 410 వరకు థియేటర్స్లో రిలీజ్ అవ్వనుంది.. ఇప్పటికే అన్ని సినిమాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.. ఈ సినిమా టికెట్ కలెక్షన్స్ లో జస్ట్ బిలో యావరేజ్ లెవెల్ లోనే ఉంది.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి మౌత్ టాక్ బాగుంటే సినిమా లాంగ్ రన్ లో అంచనాలు అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..