NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Jan 21 Today Episode: పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొనున్న దేవయాని… మళ్ళీ జగతి ఒంటరి అయిపోతుందా..?

Guppedentha Manasu Jan 21 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. మహేంద్ర హాస్పిటల్ పాలవ్వడంతో కధ కీలక మలుపు తిరుగుతుంది. హోస్పిటల్ లోజగతి మహేంద్ర గురించి రిషికి చెబుతుంది.తనని అపురూపంగా చూసుకోవాలి అని జగతి అంటే..డాడ్ విషయంలో మీరు నాకు హితబోధ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి అంటాడు.అసలు డాడ్ మనసులో మీరే ఏదైనా కొత్త సమస్యను నింపారేమో అని రివర్సవుతాడు. వసుధారను ఇంట్లో నుండి పంపించేయమన్నా విషయం డాడ్ తో చెప్పారేమో అందుకే ఆయన అనవసరమైన ఒత్తిడికి లోనేయి ఉంటారని అంటుండగా ఇంతలో అక్కడికి వచ్చిన వసుధార..మహేంద్ర సార్ మీ ఇద్దర్నీ రమ్మంటున్నారని చెబుతుంది.

YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా పోస్టింగుపై దుమారం!ఎవరికి “బలిసింది”అని ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం

Guppedentha Manasu Jan 21 Today Episode: దేవయానిని నోరుమూసుకో అన్నా ఫణింద్ర:

సీన్ కట్ చేస్తే హమ్మయ్య అంకుల్ కి ఏంకాలేదు అంటాడు గౌతమ్. గండం నుంచి బయటపడ్డాడని ఫణీంద్ర, ధరణి అంటే..గండం నుంచి బయటపడ్డాడు కానీ అసలు ఆ గండం ఎందుకొచ్చిందో ఆలోచించారా అంటుంది దేవయాని. మీరు మహేంద్రని గాలికి వదిలేశారు అంటుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొదలయ్యాకే ఇంట్లో, కాలేజీలో తలనొప్పులు మొదలయ్యాయంటుంది దేవయాని. అసలే మహేంద్రకి అలా అయిందని మేము బాధపడుతుంటే నువ్వెంటి అని కొంచెం సేపు సైలెంట్ గా ఉండు అని తిడతాడు ఫణీంద్ర.

Devatha Serial: దేవికి తన తండ్రి పోలికలు వచ్చాయని మాధవా రాధను నిలదిస్తాడా..!?
జగతి మాటలకూ ఆలోచనలో పడ్డ రిషి :

తన దగ్గర కూర్చున్న కొడుకు రిషి..భార్య జగతితో మాట్లాడతాడు మహేంద్ర. ఇంత వరకూ తెచ్చుకున్నావేంటి అంటే..నాకేం అవుతుంది జగతి..అయితే నీ దగ్గర లేదంటే రిషి దగ్గరుంటా అంటాడు. సార్ నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను అని జగతి అంటే నేను ఫోన్ దూరంగా పెట్టాను మేడం అంటాడు. రాత్రి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా వెళ్లి కాస్త రెస్టు తీసుకో అంటాడు మహేంద్ర. ఇప్పటికే 22 ఏళ్లకు పైగా ఒంటరిగా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను ఇంకెందుకు రెస్ట్ అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే నువ్వు విడిచి వెళ్లగలవా చెప్పు అంటుంది.నీకు గుర్తుందా మహేంద్ర..నాకు బుల్లెట్ తగిలినప్పుడు నువ్వెంత ఆరాటపడ్డావో,టెన్షన్ పడ్డావో.. ఎవరు వద్దన్నా అందర్నీ ఎదిరించి నన్ను ఆసుపత్రిలో చేర్పించి రాత్రంతా అక్కడే ఉన్నావు కదా మహేంద్ర అంటుంది.జగతి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావ్ అని మహేంద్ర అంటే..జీవితంలో నువ్వు అలసిపోతున్నావ్ మహేంద్ర. నీ చిరునవ్వుల వెనుక విషాదం నా ఒక్కదానికే తెలుసు అంటుంది. ఇన్నాళ్లూ నేను ఎందుకిలా ఆలోచించలేకపోయాను.నేను శిక్షిస్తోంది డాడ్ నా… నాకోసమే జగతి మేడంకి దూరమయ్యారు. నాకోసం కాకపోయినా డాడ్ కోసమైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందా అనుకుంటాడు రిషి.

దేవయాని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకకొనుందా..?

మహేంద్ర అని అరుచుకుంటూ లోపలకు వచ్చిన దేవయాని..జగతి వైపు గుడ్లు ఉరిమి చూస్తూ ఏంటీ ఘోరం అంటుంది. మహేంద్ర నువ్వు టెన్షన్ పడకు మేం అందరం ఉన్నాం కదా అని ఫణీంద్ర అంటే మనమే కదా ఉన్నాం.. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళతారు అంటుంది. కనేసి వదిలెళ్లిపోతే రిషిని కన్నబిడ్డలా చూసుకున్నా కదా అని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెద్దమ్మా ఊరుకోండి డాడ్ బాగానే ఉన్నారు కదా..మీరు ఏడిస్తే నేను చూడలేను అంటాడు రిషి. జగతి అక్కడినుంచి బయటకు వెళ్లి వసుధార దగ్గర కూర్చుంటుంది. మీరు బయటకు వచ్చేశారేంటి అని వసు అడిగితే.. వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చేశారు కదా అంటే..మీరు కూడా ఆ కుటంబంలో సభ్యురాలే కదా అంటుంది వసుధార. ఆ కుటుంబం నా సభ్యత్వాన్ని ఎప్పుడో రద్దు చేశార అని చెబుతుంది. తల్లి స్థానాన్ని, భార్య స్థానాన్ని అడుక్కోలేం కదా అంటే..అది మీ హక్కు అంటుది వసు. నీ ఆరోగ్యం గురించి ఇక నుండి మేము చూసుకుంటాం అని రిషి, దేవయాని అంటే..వాళ్లిద్దరూ ఫిక్సయ్యాక ఏం చేయలేం నువ్వు పచ్చికూరగాయలే అని అంటాడు ఫణీంద్ర.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju