Child with tail: ఈ ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలతో ఈ ప్రపంచం పూర్తిగా నిండిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ప్రపంచం రంగు మనకు కనిపిస్తుంది. ప్రతి దానికి ఓ రీజన్ ఉంటుందని కొంత మంది బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
తోకతో పుట్టిన బాలుడు..
బ్రెజిల్(Brazil) దేశంలో ఓ బాలుడు వింత వేషం వేసుకుని పుట్టాడు. ఆ బాలుడు తోకతో జన్మించడం విశేషం. ఆ తోక 12 సెంమీ.. పొడవుతో ఉంది. అంతే కాకుండా ఆ తోక చివరన ఓ బంతి గద ఆకారంలో ఉంది. ఇలా బాలుడు వింత ఆకారంలో జన్మించడానికి జన్యుపరమైన (congenital disorder) కారణాలు ఉండి ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. ఆ తోకను కత్తిరిస్తామని వైద్యులు తెలపడం గమనార్హం. ఇలా బాలుడు తోకతో పుట్టడం చూసి పలువురు వ్యక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొంత మంది ఇది సైన్స్ అంటుండగా.. కొంత మంది మాత్రం దేవుడి మహత్యం(god’s greatness)అంటున్నారు.
తోకతో జన్మించిన బాలుడికి వైద్యులు చికిత్స చేశారు. శిశువు జన్మించిన సమయంలో ఆ తోక 12 సెంమీ. పొడవు 4 సెంమీ వెడల్పుతో ఉందని వైద్యులు ప్రకటించారు. అనంతరం వైద్యులు ఆ చిన్నారికి వైద్య చికిత్స చేసి ఆ తోకను తొలగించారు. ఇలాంటి అరుదైన(rarest cases) కేసులు ఇప్పటి వరకు దాదాపు 40 వరకు చూసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి తోకతో జన్మించడం వలన ఎటువంటి అపాయం లేదని వైద్యులు ప్రకటించారు.
2 తలలతో పుట్టిన దూడ..
బ్రెజిల్ దేశంలోనే ఓ దూడ రెండు తలలు, మూడు కళ్లతో జన్మించింది. ఈ దూడను చూసిన ప్రతి ఒక్కరూ ఈ దూడ అమ్మవారి అవతారమంటూ(Incarnation of Goddess) కొనియాడుతున్నారు. ఈ దూడను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.