ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దర్శకుడు సంపత్ నంది, తమన్నా లకి సీటీమార్ హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. గతంలో సంపత్ నంది.. మెగా పవర్ స్టార్ రాం చరణ్, తమన్నా హీరో హీరోయిన్స్ గా రచ్చ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రవితేజ, తమన్నా లతో బెంగాల్ టైగర్ తీశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే తమన్నా భాటియా ఇండస్ట్రీకొచ్చి ఇంతకాలం అవుతున్నా తన అందంలో మాత్రం ఏ మాత్రం కళ తప్పలేదు. చెప్పాలంటే సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోలకి సరిపోయో ఫిజిక్ ని గ్లామర్ ని మేయిన్టైన్ చేస్తుంది. అంతేకాదు మేకర్స్ కొన్ని సినిమాల కోసం తమన్నానే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా డిసైడవుతున్నారు. బాహుబలి, సైరా సినిమాలలో అవకాశం రావడం తమన్నా అదృష్ఠం అనే చెప్పాలి. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు.. మరో కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో కూడా గ్లామరస్ రోల్స్ చేస్తూ ఖాళీ లేకుండా ఉంటోంది.
ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి సీనియర్ హీరోలతో పాటు రాం చరణ్, నాగ చైతన్య లాంటి యంగ్ హీరోలతో నటిస్తున్న తమన్న.. మొదటిసారి ఒక జూనియర్ అండ్ స్టార్ కాని హీరో పక్కన నటించబోతుందని తాజా సమాచారం. జ్యోతి లక్ష్మీ సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు పొందాడు సత్య దేవ్. గత సంవత్సరం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో సెకండ్ లీడ్ లో నటించాడు. రీసెంట్ గా సంగీత దర్శకుడు రఘు కుంచె నిర్మించిన 47 డేస్ లో నటించాడు. ఈ సినిమా ఓటీటీలో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఒక కన్నడ సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించే అవకాశం రాగా ఆ సినిమాలో సత్య దేవ్ కి తమన్నా జంటగా నటిస్తుంది. ఇది చాలామందికి షాకిచ్చింది. సత్య దేవ్ పక్కన తమన్నా అంటే ఇంకా ఎవరూ నమ్మలేకపోతున్నారు.