NewsOrbit
న్యూస్

‘వంగవీటి రాధ ‘ పేరు చెపితే వాళ్లంతా రగిలి పోతున్నారు!

కాపు ఐకాన్ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ బిజెపి వైపు చూస్తున్నారని,ఆయనను పార్టీలోకి తేవటానికి ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి పావులు కదుపుతున్నారు అని విస్తృతంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

If the name 'Vangaveeti Radha' is mentioned, they are all on fire
If the name ‘Vangaveeti Radha’ is mentioned, they are all on fire

నిజానికి రాజకీయ నిరుద్యోగి అయిన వంగవీటి రాధాకృష్ణ కు కమలనాథులు ఇంత ప్రాధాన్యం ఇవ్వటం ఏమిటన చర్చ కూడా మొదలైంది. రాధాకృష్ణ కాంగ్రెస్ పక్షాన తన రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు.తదుపరి అనేక పార్టీలు మారినా ఆయనకు గెలుపు దూరంగానే ఉండిపోయింది.

ఆయన ప్రజారాజ్యం వైసిపి టిడిపి ఇలా అన్ని పార్టీలు మారేశారు ! చివరగా తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అని భావిస్తున్న టిడిపిలోకి వెళ్లడమే కాకుండా తన తండ్రి హత్యతో టిడిపికి సంబంధం లేదని ప్రకటించి తన ఇమేజిని తానే పాడు చేసుకున్నారు అక్కడా ఆయన ఇమడలేక ఇప్పుడు బిజెపి లోకి వెళ్లాలని తెరవెనుక రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలన్న టార్గెట్ తో ముందుకు సాగుతున్న బిజెపి రాధాను సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక కేంద్ర మంత్రి కూడా రంగంలోకి దిగాడు అని చెబుతున్నారు.

అయితే రాధాకృష్ణకు ఇంత సీను ఇవ్వడం అవసరమా అని బిజెపిలో ఒక వర్గం వ్యాఖ్యానిస్తుండగా ..రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే కమలనాథులు ఆ పని చేస్తున్నారని ఇంకో కథనం వినిపిస్తోంది.బిజెపీ వ్యూహాత్మకంగా నే వంగవీటి రాధా ను తెరపైకి తీసుకు వస్తోందని, ఓవైపు జనసేనతో చెలిమి, మరొకవైపు పార్టీ అధ్యక్ష పగ్గాలు సోము వీర్రాజు కు ఇవ్వడం, ఇప్పుడు- కాపుల లో ఒక ఐకాన్ లా అప్పట్లో వెలిగిన వంగవీటి మోహన రంగా తనయుడిని తెర మీదకు తీసుకు రావడం – ఇదంతా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే బీజేపీ అమలు చేస్తోందని వారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు రెడ్డి కమ్మ సామాజిక వర్గాల గుప్పిట్లో ఉండగా మూడో ప్రధాన సామాజిక వర్గమైన కాపులను పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవడానికి బిజెపి వ్యూహాలు రచిస్తోంది.

కర్ణాటకలో మొదట్లో జెడిఎస్ వైపునున్న లింగాయత్ లను, యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా పూర్తిగా తమ వైపు తిప్పుకొని, ఇప్పుడు ఆ వర్గాన్ని తమకు బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకుందని, అదే తరహా వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని వారంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తనకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని వంగవీటి రాధాకృష్ణ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సన్నిహితులు రంగా అభిమానులు సలహా ఇస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju