షాక్ ఇచ్చిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో అమీర్ ఖాన్ ..?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోరాట యోధులు గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ మల్టి స్టారర్ లో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాత.

New Year Surprise From RRR???

కాగా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేంగంగా జరుగుతుంది . ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రామరాజు ఫర్ భీం, భీం ఫర్ రామరాజు టీజర్స్ అటు మెగా అభిమానులను ఇటు నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి .

కాగా రామరాజు, భీం పాత్రల్లో నటిస్తున్న తారక్ అండ్ చరణ్ లకి బాలీవుడ్ లో స్టార్ హీరో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని తాజా సమాచారం. ఇప్పటి నుంచే ఆర్ ఆర్ ఆర్ మీద భారీగా అంచనాలు పెంచుతున్న రాజమౌళి బాలీవుడ్ లో ఈ సినిమా మీద ఊహించని విధంగా బజ్ క్రియేట్ అయ్యేందుకు రాజమౌళి ఇలా ప్లాన్ చేసాడని సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత తారక్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కెరీర్ లో 30 వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ – కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించబోతున్నారు. ఇక చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు స్క్రీన్ మీద చరణ్ అరగంట పాటు కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి కనిపించే సీన్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల కి భారీ సర్ ప్రైజ్ గా ఉంటుందని అంటున్నారు.