గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో జోరు మీద ఉన్న కేటీఆర్..!!

గ్రేటర్ ఎన్నికల బాధ్యతను టిఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకుంటున్న మంత్రి కేటీఆర్ ప్రచారం లో దూసుకుపోతున్నరు. మరోపక్క ఇదే రీతిలో దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో ఈ ఎన్నికలలో కూడా గెలిచే విధంగా బిజెపి పార్టీ అనేక వ్యూహాలను వేస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్నికలలో కూడా పోటి ఎక్కువగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఉంది అనే టాక్ వస్తుంది.

Family rift in TRS over elevation of KTR as working presidentకచ్చితంగా జరగబోయే ఎన్నికలలో బీజేపీ జెండా హైదరాబాదులో ఎగరాలని భావిస్తున్న పార్టీ పెద్దలు… కీలకమైన నేతలను గ్రేటర్ ప్రచారంలో కి దింపడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చాలా విజయవంతంగా సాగుతోంది.

 

వరుస రోడ్ షో లతో పాటు టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎలాంటి మేలు చేసిందో వంటి విషయాలు తెలియజేస్తూ ప్రతిపక్షాలు చేసే కామెంట్లకు కౌంటర్లు వేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ వచ్చాక జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అంబర్‌పేట్‌ నియోజకవర్గం రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేతగాదు అని ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ల నోరు మూసే విధంగా.. టిఆర్ఎస్ వచ్చాక హైదరాబాదులో అభివృద్ధి జరిగిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.