Anushka : సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క మూవీ కోసం ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అరుంధతి సినిమా నుంచి టాలీవుడ్ లో ఆమె రేంజ్ అండ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలను ఒప్పుకొని ఫ్లాప్స్ చూశారు కూడా. కానీ బాహుబలి అనుష్కని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. ఈ సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తుందని అందరూ భావించారు.
అయితే అందరు అనుకున్నట్టుగా అనుష్క సినిమాలు చేయలేకపోయింది. తన ఫిజిక్ లో భారీగా మార్పు రావడం ఆమె కెరీర్ కి బాగా ఇబ్బంది కలిగింది. ఎట్టకేలకి అనుష్క భాగమతి సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో లేకపోయినా కూడా అనుష్క మాత్రం హిట్ దక్కించుకుంది. హిందీలో భూమి పడ్నేకర్ నటించిన భాగమతి భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు .. హిందీలో కూడా అనుష్క చేయాల్సింది అనే కామెంట్స్ వినిపించాయి.
Anushka : ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమని టాక్ వినిపిస్తోంది.
అంటే భాగమతి ఆమెకి ఎలాంటి పేరు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా గ్యాప్ తర్వాత అనుష్క నిశబ్దం చేసింది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరచింది. నాలుగు ప్రధాన భాషల్లో రిలీజైన కూడా ఒక్క భాషలో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దాంతో వెంటనే సినిమాను కమిటవలేదు. కాగా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనుష్క ఒక సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం కథ సరిగా సెట్ అవలేదని టాక్ వినిపిస్తోంది.