మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ .. అక్కినేని వారసడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమాని గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే akhil ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు వరసగా ఫ్లాప్ అయి అందరినీ బాగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఇప్పుడు రూపొందుతున్న most eligible bachelor మీదే అందరి చూపు ఉంది. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టినట్టు చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే వీక్ గా అనిపించిన సెకండాఫ్ లోని సీన్స్ కొన్ని రీ షూట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు akhil సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ అందుకుంటానన్న నమ్మకాన్ని బలంగా పెట్టుకున్నాడు. అయితే most eligible bachelor నుంచి న్యూ ఇయర్ కి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు ఈసారి అఖిల్ కి ఎలాగైనా భారీ దక్కాలన్న ప్లాన్ తో అల్లు అరవింద్, నాగార్జున నుంచి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శక, రచయితలు .. ప్రముఖ ఎడిటర్లు akhil most eligible bachelor సినిమాని చూసి పలు మార్పులు చేర్పులు సూచించారట. చెప్పాలంటే ఇలా ఒక హీరో సినిమాని ఇంతమంది చూసి అభిప్రాయాలు చెప్పడం చాలా అరుదు. అయితే ఇలా పలువురు అభిప్రాయాలు తెలుసుకోవడానికి.. తీసుకోవడానికి కారణం ఒక్కటే. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఒక అవగాహనకి వచ్చేయొచ్చని. మొత్తానికి akhil కోసం అంతమంది రంగంలోకి దిగి సినిమా సక్సస్ కి కారణం అవుతున్నారు.