2021 లో సుకుమార్ – అల్లు అర్జున్ ల పుష్ప రావడం కష్టమేనా .?

అల వైకుంఠపురములో వంటి ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత స్టైల్సి స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమాగా 5 భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ కానుంది.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie News - Times of India

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం అడవుల్లో షూటింగ్ జరగనుంది. అందుకోసం యూనిట్ కేరళ లోని దట్టమైన అడవుల్లో లాక్ డౌన్ కి ముందే షూటింగ్ ప్లాన్ చేసి డ్రాపయ్యారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. కాగా నవంబర్ నుంచి ఈ సినిమా మళ్ళీ కేరళ లోనే షూటింగ్ జరిపేందుకు సుకుమార్ టీమ్మ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

అయితే ఇది కూడా పక్కా కన్‌ఫర్మేషన్ లేదంటున్నారు. అంతేకాదు ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని అందరూ భావించారు. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ .. మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డట్టుగానే సమ్మర్ లో కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మహేష్ బాబు సర్కారు వారి పాట తో పోటీ పడతారని భావించారు.

కాని ఆ సమయానికి పుష్ప రెడీ కావడం కష్టమే అన టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నవంబర్ లో షూటింగ్ మొదలై అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది దసరా పండుగ కే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక మహేష్ సర్కారు వారి పాట విషయం ఏంటన్నది క్లారిటీ లేనప్పటికి సమ్మర్ కి మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని తెలుస్తుంది.