Sai manjrekar : సాయీ మంజ్రేకర్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ వారసురాలైన సాయీ మంజ్రేజర్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన పర్ఫార్మెన్స్తో బాగానే డెబ్యూ సినిమాతో ఆకట్టుకుంది. మొదటి సల్మాన్ ఖాన్ తో చేయడం అంటే గొప్ప విషయం. అందుకే ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. దాంతో ఈ బ్యూటీ మీద బాలీవుడ్లో మాత్రమే కాదు టాలీవుడ్ మేకర్స్ దృష్టి బాగా పడింది.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా రూపొందుతున్న మేజర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. గూఢాచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయీ మంజ్రేకర్ లుక్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాలో తనది కీలక పాత్ర అని అర్థమవుతోంది.
Sai manjrekar : తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంటుందా..?
అలాగే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలోనూ అమ్మడే హీరోయిన్. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్లో సాయి మంజ్రేకర్‌కి తిరుగుండదంటున్నారు. అందుకే యంగ్ బ్యూటీస్ అయిన ఉప్పెన ఫేం కృతి శెట్టి..రొమాంటిక్ ఫేం కేతిక శర్మలతో పోటీ పడుతోంది. వారి మాదిరిగా వరుసగా టాలీవుడ్లో అవకాశాలు అందుకోవాలని కసితో ఉందట. యంగ్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదలకూడదని తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్స్‌ను వింటుందట. చూడాలి మరి ఈమె తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంటుందా.