Srinu vaitla: మహేష్ బాబుతో తీసిన ఆ సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ తలకిందులైపోయింది..మళ్ళీ కోలుకుంటాడా..?

Share

Srinu vaitla: సినిమా ఇండస్ట్రీలో వరుస హిట్స్ ఇచ్చిన దర్శకులు కొందరు ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాప్స్ తీసి ఇక లైఫ్ లేకుండా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకానొక దశలో టాప్ డైరెక్టర్స్‌గా వెలిగిన వారికి నిర్మాతలు గాని, హీరోలు గానీ మళ్ళీ డేట్స్ ఇవ్వాలంటే ధైర్యం చాలని వాళ్ళు బాగానే ఉన్నారు. టాలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ మాత్రమే ప్రధానం. ఎంతటి స్టార్ హీరోయినా, దర్శకుడికైనా హిట్స్ ఉన్నంతకాలమే క్రేజ్ ఉంటుంది. నిర్మాత విషయంలో కూడా ఇంతే. వరుస ఫ్లాపుల్లో ఉన్నవాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు.

is-srinu-vaitla-career-in-risk
is-srinu-vaitla-career-in-risk

ఈ జాబితాలో దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా శ్రీను వైట్ల వెలిగిన వెలుగేంటో అందరినీ తెలిసిందే. నీకోసం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీను వైట్ల మొదటి సినిమా రిలీజ్ చేసేందుకు చాలానే కష్టపడ్డాడు. రవితేజకి హీరోగా ఇది మొదటి సినిమా. సంగీత దర్శకుడిగా ఆర్.పి.పట్నాయక్ కి కూడా. ఇందులో మహేశ్వరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా చూసిన నాగార్జున మంచి కామెడి ట్రాక్ ఉంటే నీ కోసం పెద్ద హిట్‌గా నిలిచేది. సినిమా చాలా బాగా తీశావ్. ఈసారి సినిమా అలా ప్లాన్ చేసుకొని హిట్ కొట్టు ..నీకు డేట్స్ ఇస్తాను అని మాటిచ్చాడు.

Srinu vaitla: శ్రీను వైట్ల మళ్ళీ చాలా కాలం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇక నీకోసం చూసిన రామోజీ రావు కూడా మంచి కథతో వస్తే అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అలా నాగార్జున సలహాతో ఆనందం సినిమాను రామోజీ రావు నిర్మాణంలో తీసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. చెప్పాలంటే శ్రీను వైట్ల తీసిన ఆనందం సినిమా తరహాలో చాలా సినిమాలొచ్చాయి. ఇక ఆనందం తర్వాత సొంతం, వెంకీ సినిమాలతో మంచి క్రేజీ డైరెక్టర్‌గా మారిన ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు సినిమా తీసే అవకాశం అందుకున్నాడు.

ఆ తర్వాత నుంచి శ్రీను వైట్ల మళ్ళీ చాలా కాలం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అన్నట్టుగానే నాగార్జున అవకాశం ఇవ్వడంతో కింగ్ తీసి హిట్ ఇచ్చాడు. మంచు విష్ణుతో ఢీ ఇండస్ట్రీ హిట్. రాం తో రెడీ మంచి కమర్షియల్ హిట్. రవితేజ తో దుబాయ్ శీను, వెంకటేశ్ తో నమో వెంకటేశ..సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దూకుడు సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే రేంజ్‌కి చేరుకున్నాడు. అయితే నాగార్జున చెప్పినట్టు ఆయన సినిమాలలో కామెడీ ట్రాక్ పెట్టడం అలవాటుగా మారి దాన్నే వెగటు పుట్టించేదిగా చూపించి జనాలకి విసుగు తెప్పించాడు.

అప్పటికీ ఆయన సినిమాలో కామెడీ రొటీన్ ట్రాక్ అయిపోయిందని జనాలు చెప్పుకున్నారు. ఆగడు సినిమా తర్వాత ఆయన తీసిన బాద్‌షా సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆగడు సినిమా తీసి భారీ డిజాస్టర్ ఇచ్చాడు. దాంతో శ్రీను వైట్ల కెరీర్  తలకిందులైపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు కోలుకోనేదు. ఆగడు తర్వాత రాం చరణ్ తో బ్రూస్‌లీ, మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్‌తో మిస్టర్ సినిమాలు తీసి విమర్శల పాలయ్యాడు. ఈ రెండు సినిమాలతో శ్రీను వైట్ల క్రేజ్ మరింతగా దిగజారిపోయింది.

Srinu vaitla: మళ్ళీ తిరిగి ఆ స్టార్ డం దర్శకుడిగా శ్రీను వైట్ల తెచ్చుకుంటాడా

ఇక కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో మళ్ళీ ఆయనకి రవితేజ అవకాశం ఇచ్చాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని అమర్ అక్బర్ ఆంటోని తీశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ తిరిగి ఆ స్టార్ డం దర్శకుడిగా శ్రీను వట్ల తెచ్చుకుంటాడా లేదా అనేది తెలీదు గాని ప్రస్తుతం ఢీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. డీ అండ్ డీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. చూడాలి మరి ఈ డైరెక్టర్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందా లేదా.


Share

Related posts

Gold Price Today : పసిడి ప్రియులకు ఝలక్..!! ఈరోజు బంగారం, వెండి ధరలు..!

bharani jella

ఆక్సిజన్‌ బాగా అందేలా చేసే ఆహారం ఇదే !!(పార్ట్ -2)

siddhu

ఆ డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టద్దు ఎన్‌టి‌ఆర్ అన్నా .. ప్లీజ్ ‘ ఫాన్స్ గోల గోల !

GRK