CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!

Share

CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్టాలిన్ నిర్ణయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలు అవుతున్నాయి. ప్రజా శ్రేయస్సే పరమావధిగా స్టాలిన్ ముందుకు దూసుకువెళుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం కోసం స్టాలిన్ చాలా సాహసోపేతమైన  నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒకే రోజు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు వైద్య విద్యార్థులకు గట్టి షాకులు ఇచ్చి సిఎం స్టాలిన్ పెను సంచలనాలు సృష్టించారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రొఫెషనల్స్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం కోటాను అందించి స్టాలిన్ పేద విద్యార్థుల మనసు దోచుకున్నారు.

CM Stalin sensational decisions
CM Stalin sensational decisions

మరో పక్క ఎన్నడూ లేనంతగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ఇటీవల స్టాలిన్ తగ్గించారు. తమిళనాడులో పెట్రోల్.. డీజిల్ ధరలను మూడు రూపాయలు తగ్గించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం రూ.1190 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని విధంగా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో స్టాలిన్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల సామాన్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీటికి మంచి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాలిన్. రాజకీయాల్లో ప్రత్యర్థుల పేర్లు పథకాలకు ఉంటే వాటిని వచ్చిన కొత్త పాలకులు తొలగించి వారి పేర్లు పెట్టుకుంటుంటారు. కానీ స్టాలిన్ మాత్రం 65 లక్షల స్కూల్ బ్యాగులపై అన్నాడీఎంకే మాజీ సీఎంలు జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు ఉంచాలని విద్యాశాఖను స్టాలిన్ ఆదేశించడం సంచలనమైంది. ఈ నిర్ణయం ఏఐడీఎంకే నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బ్యాగులను రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించాడు. కొత్త బ్యాగులు, వస్తు సామగ్రి కోసం ఆర్డర్లు ఇవ్వడానికి బదులుగా ఇప్పటికే కొనుగోలు చేసి ఉపయోగించని బ్యాగులను పంపిణీ చేయాలని సిఎం స్టాలిన్ నిర్ణయించారు. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం  విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిని ఆశ్చర్యపర్చింది. ఈ విషయంలో డీఎంకే శ్రేణుల్లో అసంతృప్తి గురించి  తెలియజేసినా స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదుట. స్టాలిన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష అన్నాడీఎంకే స్వాగతించింది. స్టాలిన్ నాయకత్వంలో ప్రతీకార రాజకీయాలు తగ్గాయని అన్నాడీఎంకే కొనియాడింది.  అదే విధంగా పేదలకు ఉచితంగా, సరసమైన ధరలో ఆహారాన్ని అందించే అమ్మ క్యాంటీన్ల నుండి జయలలిత, ఫళనిస్వామి ఫోటోలను తొలగించవద్దని కూడా అధికారులను ఆదేశించారు స్టాలిన్. ఇవన్నీ చర్యలతోనే ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో స్టాలిన్ ను దేశంలోనే ‘ఉత్తమ ముఖ్యమంత్రి’గా మార్చాయని అంటున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతుండగా తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

మరో పక్క కేంద్రంలోని బీజేపీకి షాక్ ఇచ్చేలా కేంద్రం ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ స్టాలిన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. నూతన వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని స్టాలిన్  అభిప్రాయపడ్డారు. అదే విధంగా తమిళనాడులో ఎంబీబీఎస్, పీజీ చేసిన వారు ఖచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందస్తామంటూ హామీ పత్రాలను రాసి ఇచ్చేవారు. అయితే ఈ అండర్ టేకింగ్ ను చదువు పూర్తి కాగానే విద్యార్థులు ఎవరూ అమలు చేయడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షలు సంపాదిస్తున్నారు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి అంగీకరించడం లేదు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సీఎం స్టాలిన్. తాజాగా తమిళనాడులోనూ పీజీ అయిపోయిన 112 మంది వైద్య విద్యార్థులు తాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసేది లేదంటూ అడ్డం తిరిగారు. అండర్ టేకింగ్ కు వ్యతిరేకంగా గొడవ చేయడంతో స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఏకంగా ఆ 112 మంది విద్యార్థులు ప్రభుత్వం ఇన్నాళ్లు వారి మీద పెట్టి ఖర్చుకు గాను వారు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వానికి వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. వైద్య విద్యార్థులు ప్రభుత్వానికి రూ.50 లక్షలు చెల్లిస్తారా ? లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీ చేస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీఎంగా ప్రజా శ్రేయస్సు కోసం స్టాలిన్ చేస్తున్న పనులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

Read More: AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!

Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..? 

YS Vijayamma: విజయమ్మ ఏం చేయబోతున్నారు..? ఆ మంత్రులకు ఆహ్వానం..!!


Share

Related posts

ఈ నెల 7లోపు రిజర్వేషన్లు ఖరారు చేయండి

Mahesh

Indian Railways: దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై ప్రకటించిన కేంద్ర మంత్రి..!!

sekhar

Hyderabad : హైదరాబాద్ నగర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ..!!

sekhar