NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఇప్పుడు మేలుకోవలసిన సమయం…!

మొత్తానికి ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. వ్యవస్థల మధ్య మనస్పర్థలు ఈ పంచాయతీ ఎన్నికల రగడకు మూలం అయినప్పటికీ…. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థలను నడిపించేందుకు కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. ముందు ముఖచిత్రంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పాలకులు ఉన్నప్పటికీ చుట్టూ ఉండే విధేయులు ఇచ్చిన సలహాలను బట్టేవారు నడుచుకుంటారు. 

 

అవతలి వారి శక్తిని అంచనా వేయలేరా?

ఇలాంటి వారి వల్లే ఏపీ ప్రభుత్వానికి ఈరోజు ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే…. ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యలను చూపించి ఎన్నికల వాయిదా వేయాలని ప్రయత్నించింది. అయితే ఎన్నికల సంఘం చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. చివరికి ఈ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు వద్ద ఇరుకులో పడేసింది. 

సుప్రీం వద్ద తెల్ల మొహం..!

ఇక జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సలహాదారులు క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలకు సంబంధించిన కనీస అవగాహన లేకుండా ఉండడంతో చివరికి ప్రభుత్వం నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. మొత్తానికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. ద్విసభ్య ధర్మాసనం నుండి సంచలన తీర్పు వెలువడి ఎన్నికలు నిర్వహించడానికి వ్యాక్సినేషన్ అసలు అడ్డం కాదని పేర్కొంది. దేశంలో అన్ని చోట్ల లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించింది. 

వారు సరిగ్గా ఉండుంటే….

వాస్తవానికి అధినేతలు ఒక మైండ్ సెట్ లో ఉంటారు. వారి చుట్టూ ఉన్న వారు ప్రవర్తించే తీరును బట్టి వారి ఆలోచనలు కూడా మారుతాయి. అంతేకాకుండా జగన్ తీసుకునే నిర్ణయాలకి ఆహాఓహో అనే బ్యాచ్ తప్పించి తర్వాత ఎదురయ్యే పరిస్థితి గురించి అతనికి వివరించి వారే కరువు అయినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పతి వరకు ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి వివాదాస్పద నిర్ణయం చూస్తే కచ్చితంగా ప్రభుత్వానికి విషయంలో కోర్టు వద్ద ఎదురుదెబ్బ తప్పదని ప్రతి సామాన్యుడికి తేలిగ్గా అర్థం అయిపోతుంది. ఇక మరి జగన్ పక్కన సలహాదారులుగా ఉన్నవారు ఏమి చేస్తున్నారో వారికే తెలియాలి. 

అసలు జగన్ సర్కార్ కి ఉన్న ఇమేజ్ చూసినట్లయితే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార పక్షం సొంతం చేసుకోవడం ఖాయం. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేసి పంతాలకు పోకుండా ముందే ఎన్నికలకు సానుకూలంగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నిజాయితీగా ఉండకుండా ఉంటేనే ఇలాంటి నష్టాలు జరుగుతాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju