NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైవీ బాబాయ్‌కు ఇటు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి… అటు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌…!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి భారీ షాక్ త‌గిలింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న త‌న కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా కోరుతున్నారు. మొద‌ట్లో ఆయ‌న‌కు గ్రీన్ సిగ్నల్ కూడా వ‌చ్చింది. అయితే.. అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ ప్లేట్ మార్చార‌ని తెలుస్తోంది. విక్రాంత్ రెడ్డిని కేవ‌లం పార్టీకే ప‌రిమితం చేయ‌డంతోపాటు.. ప్ర‌కాశం జిల్లా ప్ర‌చార ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి విశేష సేవలందించిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌ రెడ్డికి ఒంగోలు సీటు కేటాయిస్తారని యేడాది ముందు నుంచే ప్రచారం జరిగింది. రకరకాల సామాజిక సమీకరణాలు తెరపైకి రావడంతో విక్రాంత్‌ రెడ్డికి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వలేకపోయిన‌ట్టు తెలుస్తోంది.

ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన విక్రాంత్‌రెడ్డి 2014లో త‌న తండ్రి వైవీ త‌ర‌ఫున ఒంగోలు పార్ల‌మెంటు నియో జ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేశారు. అదేవిధంగా ప‌లు స‌ర్వేలు కూడా చేయించి.. త‌న తండ్రి గెలుపున‌కు స‌హ క‌రించారు. అయితే.. అప్ప‌ట్లో కొన్ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. 2019లోనూ విక్రాం త్ కోసం వైవీ ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లోనూ టికెట్ ద‌క్క‌లేదు. ఈ ద‌ఫా ఖ‌చ్చితంగా టికెట్ ద‌క్కుతుంద‌ని ఆశించారు. అయితే.. అది కూడా త‌ప్పిపోయింది. జ‌గ‌న్ కూడా విక్రాంత్ నీ ఫ్యూచ‌ర్ నాది.. ఈ సారి ఖ‌చ్చితంగా సీటు వ‌స్తుంద‌ని ఎప్పుడో హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ ఇచ్చిన హామీ దెబ్బ‌కు విక్రాంత్ కూడా మురిసిపోయి ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి త‌న తండ్రికి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డంతో పాటు ఒంగోలు పార్ల‌మెంటు సీటును చెవిరెడ్డికి దాదాపు ఖ‌రారు చేయ‌డంతో విక్రాంత్‌కు ఎక్క‌డా సీటు లేకుండా పోయింది. వైవీ సొంత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అద్దంకి ఉన్నా అక్క‌డ స‌మీక‌ర‌ణ‌ల దృష్ట్యా పోటీ చేసేందుకు వీరు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా ప్ర‌చార ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు పార్టీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

జిల్లాపై పూర్తి ప‌ట్టు పెంచుకున్న విక్రాంత్ వైసీపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌రు. కానీ, వారి గ్రాఫ్ ఎలా ఉంద‌నేది మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, అంచ‌నా వేసి వారికి ఎప్పటిక‌ప్పుడు స‌మాచారం పంపిస్తుంటారు. త‌ద్వారా.. అభ్య‌ర్థుల లోటుపాట్ల‌ను ఆయ‌న హెచ్చ‌రిస్తారు. ఫ‌లితంగా ప్ర‌తిసీటుపైనా ప‌క్కా ప‌ట్టు సంపాయించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju