ముద్దు పెట్టి ఏడు నెలలు జైలుపాలయ్యాడు.. ‘సింగపూర్’లో భారతీయుడి లీలలు!

Share

అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో మేము ముందున్నాం అని చెప్పుకుంటున్న దేశాలు చాలానే ఉన్నాయి. మాటలు కోటలు దాటినా చేతల్లో మాత్రం పనితనం కల్పించని దేశాలు అనేకం… వేరే దేశాల సంగతి పక్కన పెడితే మన దేశం అందుకు నిదర్శనమనే చెప్పవచ్చు. అమ్మాయి బయటకు వెల్లి మళ్లీ తిరిగి వస్తుందన్న నమ్మకం లేకుండా బతుకుతున్నారు నేటి తల్లిదండ్రులు. ఏండ్లు గడుస్తున్నా అమ్మాయిల విషయంలో పెండింగ్ లో ఉన్న కేసులు మాత్రం ముందుకు కదలడం లేని ఘటనలు ఎన్నో..

అయితే మన దేశంలో ఇదిలా ఉంటే విదేశాల్లో మాత్రం లైంఘిక దాడి, అత్యాచారం వంటి కేసుల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఒక అమ్మాయి విషయంలో ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుకు అక్కడి ప్రభుత్వం తగిన శిక్షను వేసింది. ఓ మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు ఓ భారతీయుడికి ఏడు నెలల జైలు శిక్ష విధించిన ఘటన సింగపూర్ లో చేటుచేసుకుంది.

ఓ మీడియా కథనం ప్రకారం..చెల్లం రాజేశ్ కన్నన్(26)కు సోషల్ మీడియా ద్వారా గతేడాది ఓ బాలిక(15) పరిచయమైంది. రాజేశ్ కు పెళ్లై అప్పటికే ఓ కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక, రాజేశ్ లు అప్పడప్పుడు మేసేజ్ లు పంపుకునేవారు. ఈ తరుణంలో మూడు రోజుల ముందు తన స్నేహితుల కోసం ఆ బాలిక కన్నన్ ను మద్యం తీసుకురామని కోరింది. దానితో అతను అంగీకరించి ముద్దు పెట్టాలని కోరాడు. దానికి ఆ బాలిక తిరస్కరించింది. అయినా బలవంతంగా ముద్దు పెట్టుకుని లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేసినట్లు అతనిపై బాలిక కేసు పెట్టింది. బాలికను బలవంతంగా ముద్దు పెట్టకుంన్నందుకు గాను కోర్టు అతనికి 7 నెలల జైలు శిక్షను విధించింది. నిందితుడు రాజేశ్ గతంలో భద్రతా సవన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ కేసుతో కన్నన్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.


Share

Related posts

ఆ సాయినాధుడే వారిని ఆదుకోవాలి!

Yandamuri

బ్రేకింగ్: జగన్ రెండు కోట్లు ఇవ్వాలి.. గ్యాస్ లీక్ ఘటన లో కొత్త డిమాండ్

Muraliak

Balakrishna: రాయలసీమ లో రచ్చ రచ్చ చేస్తున్న బాలయ్య బాబు..!!

sekhar