NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మేం చెప్పిన‌ట్టు వినాల్సిందే… టీడీపీకి జ‌న‌సేన స్వీట్ వార్నింగ్‌…!

ఏపీలో టీడీపీ – జ‌న‌సేన పొత్తు ఎన్నిక‌ల‌కు ముందే చిత్త‌వుతుందా ? జ‌న‌సేన వార్నింగ్‌లు, డిమాండ్ల‌తో అస‌లు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందా ? అంటే ర‌క‌ర‌కాల సందేహాలు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పొత్తులో భాగంగా 25 – 30 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని చెప్పుకుంటూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు జ‌న‌సేన ఏకంగా 50 – 60 సీట్లు కేటాయించ‌క‌పోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్‌ఫ‌ర్ అవ్వ‌ద‌న్న కొత్త డిమాండ్‌కు తెర‌దీస్తోంది. ఈ విష‌యంలో కాపు నేత‌, మాజీ హోం మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్య అయితే చంద్ర‌బాబు, టీడీపీని ప‌దే ప‌దే బెదిరింపులు చేస్తూ జ‌న‌సేన‌కు ఎక్కువ సీట్లు ఇవ్వాల‌ని లేఖాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు.

మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు 70 సీట్లు, 7-8 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ జోగ‌య్య లేఖ‌లు రాశారు. జోగ‌య్య ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా జోరీగ‌లా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అస‌లు పొత్తు ఆయ‌న‌కు ఇష్టం ఉందో లేదో కాని ఇప్పుడు మ‌రో లేఖాస్త్రం సంధిస్తూ పొత్తును గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. అందుకే ఇప్పుడు 50 – 60 సీట్లు కావాల‌ని ఆయ‌న ఓ పేద్ద లేఖ రాశారు. పైగా జ‌న‌సేన / కాపుల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ ఫార్ అవ్వ‌దూ అంటూ ఆయ‌న ఓ స్వీట్ వార్నింగ్‌లు ఇస్తోన్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది.

కొద్ది రోజుల క్రిత‌మే జోగయ్య జ‌గ‌న్‌ను సీఎం కుర్చీనుంచి దించేద్దాం అంటే చంద్ర‌బాబును సీఎం కుర్చీ ఎక్కించ‌డ‌మేనా ? అని కూడా ప‌వ‌న్‌ను నిల‌దీస్తున్నారు. ఇక సీఎం ప‌వ‌ర్ షేరింగ్ ఖ‌చ్చితంగా ప‌వ‌న్‌కు రెండున్న‌రేళ్లు ఉండాల‌ని కూడా జోగ‌య్య డిమాండ్‌గా ఉంది. ఆయ‌న తాజా లేఖ‌లో ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ సీట్ల‌లో 11 సీట్లు జ‌న‌సేన‌కు ఇవ్వాల‌ని చెప్ప‌డం మ‌రీ వార్నింగ్‌లా ఇవ్వ‌డం గోదావ‌రి టీడీపీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

కాపుల ఓట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అవ్వాలంటే న‌ర‌సాపురం పార్ల‌మెంటు సీటుతో పాటు ఏకంగా 11 అసెంబ్లీ సీట్లు జ‌న‌సేన‌కు ఇవ్వాల‌ట‌. ఇందులో తెలుగుదేశం పార్టీ కీల‌క నేత‌లు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న‌, ఇన్‌చార్జ్‌లుగా ఉన్న సీట్లు కూడా ఉన్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఉన్న పాల‌కొల్లుతో పాటు ఏలూరు జిల్లా పార్టీ అధ్య‌క్ష‌లు గ‌న్ని వీరాంజ‌నేయులు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఉంగుటూరు, టీడీపీ కంచుకోటలు త‌ణుకు, కొవ్వూరు, నిడ‌ద‌వోలు కూడా ఇవ్వాల‌ని జోగ‌య్య డిమాండ్గా ఉంది. మ‌రి జోగ‌య్య లేఖ‌ను జ‌న‌సైనికులు, ఇటు టీడీపీ వాళ్లు లైట్ తీస్కొని ముందుకు వెళ‌తారా ? అన్న‌ది చూడాలి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju