NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: కారెక్కిన కాసాని .. గులాబీ కండువా కప్పిన కేసిఆర్

Share

BRS: ఇటీవల సైకిల్ (టీడీపీని వీడిన) దిగిన కాసాని జ్ఞానేశ్వర్ ఇవేళ కారు (బీఆర్ఎస్) ఎక్కారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో కేసిఆర్ ఫామ్ హౌస్ నందు కేసిఆర్ సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో మనస్థాపానికు గురైన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇవేళ వివిధ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిలు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి కాసాని బీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ప్రస్తుతం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ ..ఈటల రాజేందర్ కంటే పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని అన్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని కేసిఆర్ తెలిపారు. ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలన్నారు. ఈ సారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జడ్పీ, మున్సిపల్ చైర్మన్ వంటి స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.

ఇంతకు ముందు ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని అన్నారు. బండ ప్రకాశ్ ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. ఎన్నికల తర్వాత ఎంతో అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కుల పెద్దలతో సమావేశం నిర్వహించి వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాసాని ఏడాది క్రితమే బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉండేననీ, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కాసాని రావడం తమకు శుభపరిణామం అని అన్నారు కేసిఆర్.

AP Cabinet Decisions: జర్నలిస్ట్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్


Share

Related posts

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

somaraju sharma

Digested food: వీటిని  తీసుకుంటే  చాలు..  మనం తిన్న ఆహారం  త్వరగా జీర్ణం అయిపోతుంది!!

siddhu

హైపర్ ఆది పెళ్ళి..అక్కడి అమ్మాయే పెళ్లి కూతురు??

Naina