NewsOrbit
న్యూస్ హెల్త్

మీ పిల్లల కు మార్కులు తక్కువ వస్తున్నాయని బాధ పడుతున్నారా?

పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి పద్దతి  ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ ఇద్దరు పిల్లలనూ పోల్చి చూసుకోకూడదు.అలాగని పిల్లల తెలివితేట లను, శక్తి సామర్థ్యాలను మార్కులలో కొలవడం  కూడా సరియైన పని  కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పెద్దవాళ్లు ఈ విషయాలను ఎంత వరకు  అర్థం చేసుకోగలుగుతున్నారన్నది  అసలు పాయింట్.

తలిదండ్రుల తమ ఆలోచనలను, లక్ష్యాలను పిల్లలపై ఎట్టి పరిస్థితుల్లోనూ మోపకూడదు . మార్కులు బాగా రాలేదని , టీచర్లు ఇచ్చిన అసైన్మెంట్ సరిగా పూర్తి చేయలేదనో వారిని శిక్షించడం మంచిది కాదు . తెలిసి తెలియని వయసులో ఇలా చేయడం వల్ల పిల్లలు  మానసికంగా దెబ్బతింటారు. తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు సహకారం అందించాలి. ఒక వ్యక్తి యొక్క విజయం, వైఫల్యాన్ని చెప్పడానికి ఎలాంటి ప్రమాణాలు లేవని పెద్దవాళ్లు గుర్తుంచుకోవాలి.

పిల్లలకు సంబందించిన కొన్ని అంశాల మీద అవగాహన పెంచుకోవడం వలన  తల్లిదండ్రులు పిల్లల మానసిక ఉన్నతికి సహకరించవచ్చు .చదివిన చదువులు, మాత్రమే పిల్లల తెలివితేటలకు కొలమానం కాదని   తల్లిదండ్రులు తెలుసుకోవాలి . ఆటపాటలు, జీవిత నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు వంటివి ర్యాంకుల కంటే కూడా గొప్పవి అని గుర్తు పెట్టుకోవాలి. మన విద్యావ్యవస్థ లో ఇలాంటి విషయాల గురించి ఎవరూ వివరించరు. ఎప్పుడు పరీక్షలు, మార్కులు, ర్యాంకులు అంటూ విద్యార్థుల పై ఒత్తిడి పెంచుతుంటారు . దాన్ని తల్లిదండ్రులు సరిదిద్దాలి.

పిల్లలు   కేవలం డాక్టర్ లేదా ఇంజనీర్ మాత్రమే కావాలని అనుకోకుండా  జీవితం లో సంతృప్తిని పొందగలిగే వృత్తిలో ఉండాలని భావించాలి. ఆవిధం గా వారిని ముందుకు నడిపించాలి.జీవితం లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆఫ్‌బీట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలు,  సంబంధించిన కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటి గురించివివరాలు సేకరించండి.  పిల్లల కు ఉండే అభిరుచులు, ఆసక్తులకు సరిపోయే ఒక కోర్సు లో చేర్పించండి. ఈ ప్రపంచం లో విద్య కంటే ముఖ్యమైన విషయాలు చాల  ఉన్నాయి.

విభిన్న వ్యక్తు లతో వ్యవహరించే పద్ధతులు, పరిస్థితులను ఎదురుకోవడం లో  నైపుణ్యాలు వంటివి ఏ  పుస్తకాల్లో ఉండవు. అవి తెలిసేలా చేయవలిసిన బాధ్యత పూర్తిగా మీదే అని గుర్తు పెట్టుకోండి.  పిల్లలకు ఇలాంటి నైపుణ్యాలు లేకపోతే, వారు ఎంత చదివిన  వృథా అయినట్లే. జీవన నైపుణ్యాలకు మార్కులతో అసలు  సంబంధం లేదు. ఇవన్నీ ఏ పుస్తకాల్లో దొరకవు . అందుకే భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తల్లిదండ్రులు వారికి తెలియ చెప్పాలి .

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju