అమెరికా ఎన్నికల తరహాలో కేటీఆర్..!!

ఈ ఏడాది నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కి మద్దతు తెలుపుతూ ర్యాలీలు అదేవిధంగా ప్రతి అమెరికా సభ్యుడికి ఫోన్ ద్వారా మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది.

What KTR said about taking over his father's role as the Telangana CM -  Elections Newsకాగా ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వ్యవహరించారు. మేటర్ లోకి వెళ్తే నగరంలో ఉండే పౌరులకు స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎలాంటి సూచనలు సలహాలు కూడా కేటీఆర్ అడిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను టిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తానే వ్యవహరించిన కేటీఆర్.. సోషల్ మీడియా ని బాగా వాడుకున్నారు.

 

ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉండాలంటే మళ్లీ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బకొట్టే వారికి గట్టిగా గ్రేటర్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీలన్నీ సైలెంట్ గా ఉండగా… పోలింగ్ ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో… ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల లో టిఆర్ఎస్ పార్టీ సత్తా చాటడానికి అన్ని విధాలా కృషి చేస్తూ వుంది. ఎలాగైనా గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుని దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమితో పడిన బురదను తొలగించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మంచి కసిమీద ఉంది.