Kushi Kushiga Episode 4 Stand Up Comedy Series
కొన్ని కొన్ని మంచి ఉద్దేశంతోనే పెడుతారు కానీ.. అది ఎక్కడికో వెళ్లిపోతుంది. తాజాగా నాగబాబు కొత్త కామెడీ షో పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో స్టాండప్ కామెడీలకు చాలా స్పేస్ ఉంది.. అని నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. ఉద్దేశం మంచిదే.. తెలుగు ప్రేక్షకులను స్టాండప్ కామెడీతో కనెక్ట్ చేయాలని బాగానే సెటప్ చేశారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు అయిపోయింది. నాలుగో ఎపిసోడ్ కూడా తాజాగా విడుదలయింది.
నిజానికి స్టాండప్ కామెడీ అంటేనే హెల్దీ కామెడీతో నవ్వించడం. సరే.. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఓకే కానీ.. నాగబాబు స్టాండప్ కామెడీ షోలో బూతులు ఎక్కువైపోతున్నాయి.. అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కామెడీ హెల్దీగానే ఉంది కానీ.. మూడో ఎపిసోడ్ నుంచి కామెడీ శృతి మించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కొందరు కంటెస్టెంట్ల కామెడీ ఓకే కానీ.. మరికొందరు కంటెస్టెంట్లు మాత్రం బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్ లతోనే తమ స్టాండప్ కామెడీని పంచేశారు. అది కొంచెం శృతి మించితే భవిష్యత్తులో ఈ షో ఎక్కడికో పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ఎపిసోడ్ 4 లో కూడా కొందరు కంటెస్టెంట్లు శృతి మించిన కామెడీ చేశారు. ఏది ఏమైనా ఒక మంచి ఉద్దేశంతో స్టాండప్ కామెడీని ప్రారంభించారు నాగబాబు కానీ.. దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి.. హెల్దీ కామెడీని పండిస్తే ఖుషీ ఖుషీగా కామెడీ షో సక్సెస్ అయినట్టే.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…