కరోనాకు వ్యాక్సిన్ వచ్చేలోపు మారణహోమం తప్పేలా లేదు…!

ఒకపక్క భారతదేశంలో త్వరలోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాబోతోందని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ హింట్ ను ఇచ్చేశాడు. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దీనికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై అతి కీలకమైన భేటీ జరిగింది. కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ ట్రయల్స్ దాదాపు అన్ని దేశాల్లో మూడో దశకు చేరుకున్న తర్వాత ఇక వ్యాక్సిన్ విడుదల కావడమే అని ప్రపంచమంతా ఈ విషయంపై ఆనందిస్తోంది.

 

వ్యాక్సిన్స్ రెడీ….

భారత్ బయోటెక్ కోవాక్సిన్ ను విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఇక అమెరికాకు చెందిన ఫైజర్ కూడా మంచి నాణ్యత కలిగిన వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు సిద్ధమైంది. అయితే అమెరికా మాత్రం ఒక విషయానికి కంగారు పడుతోంది. వ్యాక్సిన్ వచ్చేలోపు మరెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని వారంతా వాపోతున్నారు. ఒక్క మంగళవారం రోజు అమెరికాలో రెండు వేల ఒక వంద మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. మే తర్వాత ఒక్క రోజులో అత్యధిక కరోనా మరణాలు చూడడం అమెరికాలో ఇదే మొదటిసారి.

అమెరికా పరిస్థితి దారుణం….

ఏప్రిల్ 15న అత్యధిక సంఖ్యలో 2600 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. ఇక ఎన్నికలు జరిగిన వారం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. వేలాది మంది ప్రజలు హాస్పిటల్ లో వైరస్ బారినపడి చేరుతున్నారు. రోజు వారి కేసులు క్రమంగా పెరుగుతుంటే…. గత మూడు వారాల్లో అమెరికాలో దాదాపు లక్ష మంది కరోనా వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.

రాబోయే రోజులు కీలకం

ఎన్నికల సమయంలో చాలా మంది కనీస జాగ్రత్తలు పాటించకుండా వీధుల్లో తిరిగారు. ఇక వైద్య శాఖ మాస్క్ పెట్టుకోమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్ళు మూసివేశారు. లాక్ డౌన్ వైపు వైపు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారి సంబరాల వల్ల ఎక్కువ కేసులు నమోదయ్యాయని రిపోర్టర్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. వచ్చే నెల క్రిస్మస్ సమయంలో జనాలు మరింత ఎక్కువ గ్రూపులు కడతారు. మరి వైరస్ ను వ్యాక్సిన్ వచ్చేవరకూ ఆ దేశ ప్రజలు నిలువరించగలరా అన్నది సందేహమే