డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి మొదటి సినిమాతోనే నంది అవార్డు సాధించి తండ్రి బాటలో అడుగులు వేసింది ఇప్పుడు లక్ష్మి కూతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డు సాధించింది.. “యంగెస్ట్ చెస్ ట్రైనర్ “గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అందుకుంది..! తాతకు తగ్గ మనవరాలిగా ఇంత చిన్న వయసులోనే పెద్ద రికార్డు సృష్టించింది. మంచు లక్ష్మి “సో ప్రౌడ్ అఫ్ యూ మై ఆపిల్” అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది..
డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చొక్కలింగం బాలాజీ సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డును కైవసం చేసుకుంది.. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు. అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను.. అందుకే విధ్యా కి చిన్న వయసులోనే ట్రైనింగ్ ఇప్పించాను. కానీ రెండు వారాల్లోనే తన కోచ్ కార్తీక్ నాకు దగ్గరకు వచ్చి చాలా బాగా ఆడుతుంది. ఈ రికార్డు కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. నేను ఇప్పుడే వద్దు సార్ కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నాను. కానీ విద్య ఇంత చిన్న వయసులోనే యంగెస్ట్ ట్రైనర్ గా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. ఒక తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను అని చెప్పింది. అంతేకాకుండా “సో ప్రౌడ్ అఫ్ యూ మై ఆపిల్” అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఈ విషయమై మోహన్ బాబు మాట్లాడుతూ చెస్ ఆడడం నాకు ఎప్పటికీ రాదు. అటువంటిది నా మనవరాలు చెస్ నేర్చుకుని ఏకంగా నొబుల్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ఇంత చిన్న వయసులోనే నా మనవరాలు ఈ రికార్డు సాధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు.