NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP: వైసీపీకి ఆ మంత్రి షాక్ ఇస్తారా ..? సర్దుకుపోతారా..?

YCP: గుమ్మనూరు జయరాం .. వరుసగా రెండు సార్లు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా గుర్తింపు ఉంది. ఆర్ధికంగానూ బలమైన నేత. ఆ కారణంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ నేతకు మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ రెండో సారి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన టికెట్ ను వేరే వాళ్లకు ఇవ్వడంతో ఖంగుతిన్నారు.

కర్ణాటకలో ప్రజాప్రతినిధిగా ఉన్న తన బంధువుతో సీఎం జగన్ కు సిఫార్సు చేయించుకోవడంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కర్నూల్ లోక్ సభకు పోటీ చేయాలని చెప్పారు. కర్నూల్ లోక్ సభ అభ్యర్ధిత్వం ఖరారు చేశారు. కానీ ఆయనకు మాత్రం లోక్ సభకు పోటీ చేయడానికి ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తొంది. కర్నూల్ లోక్ సభ ఇన్ చార్జిగా ప్రకటించిన నాటి నుండి అందుబాటులో లేకుండా పోయారు జయరాం. ఎక్కువ రోజులు బెంగళూరు,  బళ్లారిలోనే ఉంటున్నారని సమాచారం. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు. కానీ కర్నూల్ లోక్ సభ నుండి పోటీ చేస్తారో లేదో తెలియజేయలేదు.

మరో పక్క జయరాం పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలియడంతో ప్రత్యర్ధి పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జయరాం..2009 లో ప్రజా రాజ్యం తరపున అలూరు అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2011 లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు వైసీపీ ఆ స్థానానికి ఇన్ చార్జిగా విరూపాక్షిని నియమించింది. అదే నియోజకవర్గం నుండి మరో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని జయరాం భావిస్తున్నారు. వైసీపీ అధిష్టానం మాత్రం ససేమిరా అంటోంది.

అభ్యర్ధి ప్రకటన తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు జయరాం. ఆయన కర్ణాటక రాష్ట్రంలో బళ్లారిలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల మంత్రి వర్గ సమావేశానకి హజరైన జయరాం మళ్లీ అందుబాటులో లేకుండా పోయారు. ఆలూరులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి జయరాం హజరు కాలేదు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో కర్నూల్ మేయర్ రామయ్యను పార్లమెంట్ అభ్యర్ధిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది.

జయరాంకు కర్ణాటక మంత్రి నాగేంద్ర సమీప బంధువు. మంత్రి నాగేంద్ర ద్వారా అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో జయరాం సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే కర్నూలు జిల్లా బాధ్యతలతో పాటు అలూరు టికెట్ కేటాయించడం ఖాయమని తెలుస్తొంది. అయితే వాల్మీకి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న అయిదు సీట్లు కర్నూలు, అనంతపురం జిల్లాలో కేటాయించాలని కోరారని అంటున్నారు.

ఇటు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతూనే మరో పక్క టీడీపీతోనూ టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. టీడీపీ మాత్రం ఆలూరు కాకుండా పక్క నియోజకవర్గం ఇవ్వడానికి సంసిగ్దత వ్యక్తం చేసిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో జయరాం వైసీపీకి షాక్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళతారా..? కర్నూల్ ఎంపీ టికెట్ తీసుకుని సర్దుకుపోతారా..? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

YSRCP: బాలినేని కొత్త ప్రతిపాదన .. సీఎం జగన్ ఏమంటారో..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?