సూపర్స్టార్లు ఊరికే ఎవ్వరూ అవ్వరు. ఎన్నో మెట్లు ఎక్కి వచ్చిన వారే సూపర్స్టార్లు. కెరీర్ పరంగా కావచ్చు, జీవితం నేర్పిన పాఠాల పరంగా కావచ్చు. ఏదైనా గొప్ప అనుభవం మాత్రం వారి సొంతం అవుతుంది. తాజాగా తన అనుభవంతో బిగ్ బి అమితాబ్‌బచ్చన్ తీసుకున్న నిర్ణయం అందరి మన్ననలు పొందుతోంది. ఆయన సినిమాల్లో లెక్చర్లు దంచడం లేదు. ఆయన నిజ జీవితంలో చేసి చూపించిన ఓ పని అందరికీ స్ఫూర్తిని పంచుతోంది. బీహార్‌కు చెందిన కొంతమంది రైతులు తమ అప్పులను కట్టుకోలేని స్థితిలో ఉన్న విషయం బిగ్ బీ దృష్టికి వచ్చింది. వారి అప్పులను తీర్చి, వారి జీవితాలను సుగమం చేయాలని ఆయన భావించారు. అందులో భాగంగానే ఆయన ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 2100 మంది రైతులు చేసిన రుణాలను తీర్చేశారు. కొందరి రుణాలను నేరుగా ఆయనే చెల్లించగా, మరికొందరి రుణాలకు అయ్యే ఖర్చును వారి ఖాతాల్లో జమ చేశారు. ఒట్టిమాటలు చెప్పడం తనకు చేతకాదని, తన వంతు చేయడమే తెలుసునని ఆయన మరోసారి చాటుకున్నారంటూ నెట్టింట్లో ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
previous post
next post