Avneet Kaur: అవనీత్ కౌర్ గురించి వినే వుంటారు. నునులేత వయస్సు గల ఈ ముద్దుగుమ్మ ఓ నడివయసు హీరోతో రొమాన్స్ కి సిద్ధపడింది. దోస్త్, మర్దానీ, మర్దానీ-2 వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు చేసింది అందాల అవనీత్ కౌర్. తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్‌తో భారీ ఎత్తున బి టౌన్లో అభిమానులను పోగేసుకుంది. సోషల్ మీడియాలోను ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసినదే. ఇకపోతే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మిస్తున్న ‘టికు వెడ్స్ షేరు’ అనే సినిమాలో అవనీత్ కౌర్ కీ రోల్ పోషిస్తోంది.
Jagananna Thodu: నేడే జగనన్న తోడు నిధులు పంపిణీ .. చిరు వ్యాపారుల్లో ఆనందం
Avneet Kaur: ఇంతకీ ఎవరా నడివయస్సు హీరో?
కంగనా ప్రొడ్యూస్ చేయబోయే చిత్రంలో అవనీత్ సరసన నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించనున్నాడు. తన కంటే దాదాపు 30 ఏళ్లు పెద్దవాడైన నవాజుద్దీన్‌తో నటించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఈ 20ఏళ్ల అమ్మడు ఈ విధంగా స్పందించింది. నటీ నటుల మధ్య వయసు తారతమ్యం అనేది పెద్ద మేటర్ కాదని, ఇలా చాలా వయస్సు గాప్ ఉన్న నటులు గతంలో పలు చిత్రాలు చేశారని, నేటికీ చేస్తున్నారని తెలిపింది. స్క్రిఫ్ట్ వినిపించినప్పుడు, ముందుగానే… ఈ విషయం గురించి కంగన తనకు చెప్పిందని, అంతేకాకుండా పాత్ర యొక్క గొప్పతనం గురించి కూడా వివరించారు అని చెప్పుకొచ్చింది.
Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!
మరిన్ని వివరాలు:
అవనీత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “నేను ఓ సినిమాలో నటించడానికి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది, ఇకపోతే ఆ సమయంలో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్లు ఉంటే ప్రాజెక్టు రాదు. టాలెంట్ ఉంటేనే ఇక్కడ అవకాశం వస్తుంది. ఓ చిత్రంలో నటించాలని నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులను నా నటనతో ఫిదా చేయాలనుకుంటున్నాను. ఇది కూడా అలాంటి సినిమానే. పైగా నవాజుద్దీన్ సిద్దిఖీ అనే అతను మోస్ట్ టేలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. అలాంటివారిలో పనిచేస్తే ఆ కిక్కే వేరు” అని అవనీత్ కౌర్ చెప్పింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!