Bigg Boss Ott: బుల్లితెరపై సూపర్ హిట్‌గా నిలిచిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. `బిగ్‌బాస్ నాన్ స్టాప్` పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను 24/7 ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక మొదటి వారం ముమైత్ ఖాన్ ఇంటి బాట పట్టగా.. రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
రెండో వారంలో నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఎంపిక అయిన సంగతి తెలిసిందే. అఖిల్, అషురెడ్డి, అరియానా, మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, శ్రీపాక, హమీదా, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, సరయు నామినేట్ అవ్వగా.. ఈ 11 మందిలో ఒకరు రెండో వారం బ్యాగ్ సద్దేయబోతున్నారు.
అయితే ఆ ఒకరు ఎవరో కాదు శ్రీరాపాక అని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొదట మిత్రావ్ శర్మ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు రాపాక పర్ఫామెన్స్ బాగా లేకపోవడం వల్ల ఆమె ఓటింగ్‌లో వెనకబడిపోయిందట. దీంతో ఆమెనే ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నారు.
కాగా, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీరాపాక.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `నగ్నం` మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో మితిమీరన గ్లామర్ షో చేసి పాపులర్ అయిన శ్రీరాపాక.. వెస్ట్రన్‌లో ఉన్న మాస్, ట్రెడిషనల్లో ఉన్న క్లాస్ రెండిటినీ కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగుర్రం ట్యాగ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!