Sivaji: సినీ నటుడు హీరో శివాజీ అందరికీ సుపరిచితుడే. తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. కామెడీ తో పాటు సీరియస్ మరియు విలన్ పాత్రలు కూడా చేశారు. ఇటీవలే “90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్” అనే వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ బాగా ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ రాకముందు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా నిలిచిన శివాజీ టాప్ త్రీ గా నిలిచారు. కానీ అద్భుతమైన మైండ్ గేమ్ ఆడటం జరిగింది. ఏకంగా బిగ్ బాస్ తోనే మైండ్ గేమ్ ఆడి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలో తాజాగా వర్తమాన రాజకీయాలపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో ఏపీ రాజకీయాల్లో శివాజీ యాక్టివ్ గా ఉండటం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శివాజీ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు. తనలాంటి వారికి రాజకీయాలు సెట్ కావని అన్నారు. యాక్టింగ్ లోనే ఉంటానని ప్రజల సమస్య వచ్చినప్పుడు వారికి గొంతునవుతానని స్పష్టం చేశారు. గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసమే తాను పోరాటం చేసినట్లు ఆ విషయంలో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా నాయకులు కలిసి ఉన్నారని అన్నారు. నిజాలు మాట్లాడుతున్న కాబట్టి అందరికీ సమస్యగా ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడూ భాగం కాలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఆపాదిస్తే కచ్చితంగా ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను.. అందరి… పని చెబుతానని అన్నారు. దయచేసి నా జోలికి రావొద్దు అంటూ శివాజీ హెచ్చరించారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!