Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఇదొక ట్రెండ్ గా మారింది. దీన్ని స్టార్ట్ చేసింది మహేష్ బాబు అభిమానులు. 2023లో మహేష్ పుట్టినరోజు నాడు “పోకిరి” రీరిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఫోర్ కే ప్రింట్ సరికొత్త టెక్నాలజీతో.. “పోకిరి” రీరిలీజ్ చేయడం జరిగింది. ఇక అప్పటినుండి చాలామంది టాప్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు పది సంవత్సరాలు పురస్కరించుకొని.. కూడా విడుదల కావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక రోజు స్పెషల్ షో పడతాది. ఆరోజు అభిమానులు ఫుల్ సందడి చేస్తారు.
ఇప్పుడు ఈ రకంగానే రామ్ చరణ్ కెరియర్ లో రెండో సినిమా “మగధీర” రీరిలీజ్ చేయబోతున్నారట. మార్చి 26వ తారీకు.. సరిగ్గా చరణ్ జన్మదినోత్సవానికి ఒక్కరోజు ముందు గ్రాండ్ గా.. నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారట. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో అభిమానులను అలరించింది. రెండో సినిమాకే తన నటనలో అద్భుత కోణాన్ని చూపించడం జరిగింది. 100 మందితో చరణ్ చేసే ఫైట్.. సినిమాకి హైలెట్ గా నిలిచింది. 2009లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.
చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 26న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలియజేయడం జరిగింది. దీంతో మరోసారి ఈ మాస్టర్ పీస్ ను చూసే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక చరణ్ బర్త్ డే నాడు “గేమ్ చేంజర్” సినిమా నుండి అప్ డేట్ రాబోతుందట. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా నుండి కూడా అప్ డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!