Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తలరాతన మాత్రమే కాదు ప్రపంచంలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమా “పుష్ప”. “బాహుబలి” ఏ రకంగా అయితే విజయం సాధించిందో దాదాపు ఆ దిశగానే.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచ సినీ రంగాన్ని “పుష్ప” ఒక ఊపు ఊపింది. “పుష్ప” సినిమాలో డైలాగులు మరియు పాటలు ప్రాంతాలకు భాషలకు దేశాలకతీతంగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అదే రీతిలో సినిమాలో “ఉ అంటావా ఊఊ అంటావా” అనే ఐటెం సాంగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో బన్నీతో కలసి సమంత అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ లో కూడా ఆ తరహా లోనే సాంగ్ డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేయటం జరిగింది అంట.
మామూలుగానే సుకుమార్ మరియు బన్నీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో అన్నిటిలో కూడా ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇద్దరితోపాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మొదటి నుండి.. అదరగొట్టే బాణీలు ఇవ్వటం జరిగింది. బన్నీతో సుకుమార్ తీసిన మొదటి సినిమా “ఆర్య”లో ఆ అంటే అమలాపురం, “ఆర్య 2” లో.. రింగ రింగా.. సాంగ్స్ ఎంతగానో అలరించాయి. ఇలా ఉంటే ఇప్పుడు “పుష్ప 2″లో ఐటెం సాంగ్ నీ భారీ ఎత్తున ప్లాన్ చేయడం జరిగిందట. ఈ సాంగ్ లో బన్నీతో ఊర్వశీ రౌతలా స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం ఏకంగా ఈ ముద్దుగుమ్మ దాదాపు రెండు కోట్లు డిమాండ్ చేయడం జరిగిందట. సాంగ్ మొత్తానికి నిర్మాతలు 7 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొదటి పార్ట్ లో ఐటెం సాంగ్ ఊహించని రేంజ్ లో హిట్టు కావడంతో రెండో పార్ట్ లో భారీ హడావిడిగా సాంగ్ ఉండబోతున్నట్లు టాక్. మొదలవుంటే పుష్ప మొదటి భాగం విడుదల చేస్తున్న దాని కంటే రెండో పార్ట్ అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారట. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు “పుష్ప” సెకండ్ పార్ట్ కి సంబంధించి విడుదల చేసిన చిన్న పాటి స్పెషల్ వీడియో.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!