బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ తదుపరి చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’పై ఫోకస్డ్గా ఉన్నారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచించి ఆమెను సంప్రదించారట. అయితే ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ కరీనా ఓకే చెబితే ఆమిర్, కరీనా జంట పదేళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నట్లే. 2009లో వీరిద్దరూ కలిసి త్రీఇడియట్స్లో నటించారు. ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. కరీనా ప్రస్తుతం హిందీ మీడియం సీక్వెల్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటిస్తున్నారు. టీవీ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
‘లాల్ సింగ్ చద్దా’ కోసం ఆమిర్ అథ్లెట్‌లా తయారవుతున్నారు. అందుకోసం బరువు తగ్గుతున్నారట. సెప్టెంబర్, అక్టోబర్‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!