NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 13 2024 2128 Episode: అరుణ్ కుమార్ అమృత ఇద్దరూ దాచినపల్లి గ్రామానికి చేరుకుంటారా లేదా.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

Kumkuma Puvvu March 13 2024  2128 Episode: కావేరి బట్టలు ఉతుకుతూ ఉంటుంది చంద్రం పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తూ కావేరి ఉతికి జాడించి ఇచ్చిన బట్టలన్నీ తీసుకువెళ్లి మీద ఆరివేస్తూ చాలా సరదా సరదాగా డాన్స్ చేస్తూ ఉంటాడు చంద్రం అది చూసిన కావేరి ఏమయ్యా. నీకు డాన్స్ పాటలు ఇప్పుడే కావాలా నాకు ఒక వైపు బట్టలు ఉతికి ఉతికి నా ఒళ్ళు ఊనమైపోతుంటే నీకు మాత్రం చాలా హుషారుగా ఉందనుకుంటా అని అంటుంది. చంద్రం అవును కావేరి ఎప్పుడు తెల్లవారిందా లేచామా తిన్నామా పడుకున్నామా అన్నట్టే ఉండేది మన లైఫ్ ఇప్పుడు ఇలా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఆహా ఎంత బాగుందో తెలుసా ఇది కూడా ఒక ఎంజాయ్మెంట్ ఏ కావేరి అంటాడు చంద్రం.కావేరి ఏడిసిందిలె నీ యవ్వారం ఒకవైపు భార్యకు ఆరోగ్యం బాగో లేకపోయినా ఇల్లంతా శుభ్రంగా ఉంచి వంట చేసి మిమ్మల్ని పనికి పంపించి మళ్లీ మీరు వచ్చాక మీ మూడు నిమిషాల ముచ్చట కోసం కాసేపు సరదాగా ఉంటే ఏం పోతుంది నీ సొమ్మన్నట్టు మమ్మల్ని పీకు తింటారు కదా చి చి అసలు మీకు ఒళ్లంతా స్వార్థమే కదా మి మగాలు ఇంతేనా అని అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights
Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

కట్ చేస్తే ఊరు మొత్తం చాటింపు చేస్తూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో అంటువ్యాధి వస్తుందంట అని శాంభవి గారు ఒక అతనితో ఊరు మొత్తం డబ్బు కొట్టి చాటింగ్ చేయిస్తూ ఉంటుంది. అది విన్న కావేరిఏమండీ మన దిశతిరిగిపోయింది కదా అని అంటుంది చంద్రం అలా ఎలా తిరిగిపోతుంది కావేరి ఇప్పుడు మనం మన ఆస్తులు అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి పడ్డాము కదా అని అంటాడు. కావేరి ఇదే మరి నాకు మండేది ఇప్పుడే కదా డబ్బు చాటింగ్ చేశారు వినలేదా అంటుంది.చంద్రం ఏంటి కావేరి నాకు వినబడలేదు చెప్పు అంటాడు. కావేరి మన అమృత వాళ్ళ నాన్నగారు ఊరు ఏంటో తెలుసా అని అంటుంది.చంద్రం ఓ ఎందుకు తెలియదు దాచిన పళ్లి అని చెప్పింది కదా అమృత అని అంటాడు. కావేరి అదే మరి ఆ దాచినపల్లి గ్రామానికి మనం వచ్చాము అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights
Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

చంద్రం అబ్బా నిజంగానా కావేరి అంటే మనం అనుకోకుండానే ఈ దాచినపల్లి గ్రామానికి వచ్చి చేరుకున్నామా అని అంటాడు కావేరి అవునండి ఇక పదండి మనం ఆ శాంభవి గారి దగ్గరికి వెళ్లి జై చంద్ర కూతురు మా మరదల అమృతే ఆ అమృతకు పుట్టిన  కూతురు మా అంజలి ఆ అంజలి నా బండి కొడుకు భార్య అని చాలా గర్వంగా చెప్పుతాను పదండి అంటే చంద్రం ని తీసుకొని శాంభవి గారి ఇంటికి బయలుదేరుతుంది కావేరి.జై చంద్ర ప్రకృతి వైద్యశాలకు ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి పసరు మందులు ఎలా తయారు చేస్తారు దానికి సంబంధించిన ఫార్ములా నాకు చెబుతారా అంటూ వచ్చి అక్కడ ఉన్న బంటి ని అడుగుతూ ఉంటాడు. అది విన్న చరణ్ రాజ్ వచ్చి ఎవడివి రా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సీక్రెట్లు తెలుసుకోమని ఎవరు పంపించారు నిన్ను అంటూ అతన్ని గుండెల మీద తన్నుతాడు అమ్మ అమ్మ అంటూ శాంభవి గారిని పిలుస్తారు. శాంభవి బయటికి వస్తుంది ఎవర్రా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా సీక్రెట్లు తెలుసుకోవడానికి ఎంత ధైర్యం నీకు అంటూ అతన్ని తిడుతూ కొడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి అమ్మ క్షమించండి నేను ఒక వైద్యున్ని వైద్యశాలలు పెట్టి నేను చాలా నష్టపోయాను అందుకే ఇక్కడ వైద్యం గురించి తెలుసుకొని వెళ్లి అక్కడ నేను మళ్ళీ వైద్యం మొదలు పెడదామని అనుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights
Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

శాంభవి పెద్దోడా వీడిని పరిగెత్తుకుంటూ కొడుతూ ఊరి పెళ్ళిమర వరకు తరిమేయండి అని అంటుంది. అక్కడికి చేరుకున్న కావేరి చంద్రం శాంభవి చేసే పని గురించి చూసి చాలా షాక్ అవుతారు ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడతారు. శాంభవి మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. కావేరి అయ్యో అదేనండి మిమ్మల్ని చూసి పోదామని వచ్చాము అని అంటుంది శాంభవి నిన్ననే చూశారు కదా మళ్లీ ఎందుకు వచ్చారు అని కోపంగా అంటూ వీళ్ళకి ఏదైనా పని అప్పచెప్పండి అంటూ వెళ్ళిపోతుంది శాంభవి. రాత్రి అయింది అంజలి గదిలో నిద్రపోతూ ఉండగా సంజయ్ అంజలి గదిలోకి వచ్చి తన దగ్గర కూర్చుని తనని చూస్తూ తన మీద చెయ్యి వేయబోతూ ఉండగా అది చూసిన బంటి వచ్చి సంజయ్ ని లాగిపెట్టి కొడతాడు.అంజలి నిద్రలేచి బంటి సంజయ్ ఏం జరిగింది అని అడుగుతుంది వంటి అంజలి వీడు నీ గదిలోకి వచ్చి చిచి ఎలా ప్రవర్తిస్తున్నాడు తెలుసా అని అంటాడు. సంజయ్ వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ అన్నయ్య వదిన అమ్మ అందరూ రండి అని బయటికి పిలుస్తాడు. సంజయ్ అన్న వదినలు చెల్లి బయటికి వస్తారు సంజయ్ అన్నయ్య ఈ బండి నన్ను  కొట్టాడు అని చెబుతాడు చరణ్ రాజు మాధవి అఖిల షాక్ అవుతారు మాధవి ఆగండి మీరు ఈ పంచాయతీని అత్తయ్యతో చెబితేనే మంచిది అంటూ అత్తయ్య అత్తయ్య అంటూ శాంభవి గారిని పిలుస్తుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights
Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ ఇద్దరు కారులో బయలుదేరుతూ ఉండగా యుగంధర్ వస్తాడు అమృత వెళ్లి కారులో దాక్కుంటుంది.యుగంధర్ అరుణ్ కుమార్ దగ్గరికి వస్తాడు అరుణ్ కుమార్ ఏంటి యుగంధర్ మా అమృత ఎక్కడైనా కనిపించిందా మా అమృత నాకు క్షేమంగా అప్ప చెప్పలేదే అనుకో నీ అంత చూస్తాను అని అంటాడు. కానిస్టేబుల్స్ సార్ మేమందరము అమృత గారి గురించే వెతుకుతున్నాము అని అంటారు. యుగంధర్చూడండి అరుణ్ గారు మీ అమృత ఈ సిటీలో ఎక్కడ ఉన్నా వెతికి వెతికి పట్టుకొని మీ అమృత నోటి నుండే ఆ అంజలి ఎక్కడ ఉందో చెప్పిస్తాను అంజలికి శిక్షపడేలా చేస్తాను చూస్తూ ఉండు అంటూ వెళ్ళిపోతాడు యుగంధర్. తర్వాత అమృతకారు నుండి బయటికి వచ్చి ఏమండీ ఆ యుగంధర్ మనల్ని వదిలేలా లేడు ఏం చేద్దాం అండి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights
Kumkuma Puvvu Today Episode March 13 2024  2128 Episode highlights

అరుణ్ కుమార్ మనం చేసేది ఏమీ లేదు అమృత ఈ ఆశ కేసు క్లోజ్ అయ్యేంతవరకు మనం కూడా ఈ సిటీ వదిలి ఎటైనా పల్లెటూర్లోకి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అంటాడు. అమృత అయితే మా నాన్నగారి ఊరికి వెళ్దామా అండి అని అంటుంది.అరుణ్ కుమార్ కరెక్ట్ గా చెప్పావు అమృత అలాగే వెళదాం మీ నాన్నగారి ఊరు పేరు ఏమన్నావు అంటాడు.మా నాన్న వాళ్ళ ఊరు పేరు దాచినపల్లి అండి అక్కడికి వెళ్లి పోదాం అని అంటుంది. అరుణ్ కుమార్ సరేఅమృత ఈ కారును కూడా ఎక్కడైనా పక్కన పెట్టేసి వెళ్లిపోదాము అని అంటాడు. అమృత అలాగేనండి అంటుంది

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri