NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా .. మళ్లీ ఎప్పుడంటే ..?

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడింది. ఆయన ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న కిర్లంపూడి నుండి భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకుని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Mudragada Padmanabham

ఇందుకు గానూ తనతో కలిసి ప్రయాణం చేయాలనుకునే అభిమానులు తరలిరావాలని కూడా ముద్రగడ పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ర్యాలీలో పాల్గొనే వారు ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకోవాలని, వాహనాలు కూడా సొంతంగానే సమకూర్చుకోవాలి ఆయన ఇటీవల తన అభిమానులకు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే వైసీపీలో తన చేరిక వాయిదా పడినట్లుగా ముద్రగడ తాజాగా మరో లేఖ విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా తాడేపల్లికి వెళితే అక్కడ ఎక్కువ మంది కూర్చోడానికి కాదు, నిలబడటానికి కూడా స్థలం సరిపోదని, అదే క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల అభిమానులతో కలిసి వెళ్లే కార్యక్రమాని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అభిమానులను నిరుత్సాహపర్చినందుకు మరో సారి క్షమాపణలు తెలియజేశారు ముద్రగడ.

ఈ నెల 15, 16 తేదీల్లో తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి సీఎం సమక్షంలో పార్టీలో చేరతానని తెలియజేశారు. కిర్లంపూడి నుండి తాడేపల్లి ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తొంది. అంతే కాకుండా ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కర్నూల్, నంద్యాల జిల్లాల పర్యటనలు ఉండటం కూడా ముద్రగడ చేరిక వాయిదా పడటానికి ఒక కారణమని అంటున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది.

BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju