తమిళ్ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ తెలుగు రిమేక్‌లో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ‘ఎఫ్2’, ‘వెంకీ మామ’ రూపంలో ఈ ఏడాది రెండు సూపర్ హిట్లను వెంకటేశ్ దక్కించుకున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ అడ్డాల… మరో హిట్ ఇస్తాడన్న కాన్ఫిడెంట్‌తో వెంకీ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే.. వచ్చే నెల 3న సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ సినిమా కోసం ఇప్పటికే గడ్డం పెంచిన వెంకటేశ్.. ఫస్ట్ షెడ్యూల్‌కి రెడీ అయ్యారు. ఇక ఫిమేల్ లీడ్ రోల్ కోసం శ్రియను అనుకుంటున్నారట. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మణిశర్మ స్వరాలు అందించనున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!