`ఏమాయచేసావె`, `ఆటోనగర్ సూర్య`, `మనం` చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని… పెళ్లి చేసుకున్న చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తోన్న తొలి చిత్రం `మజిలీ`. `నిన్నుకోరి` ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతతో పాటు దివ్యాంశిక కౌశిక్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతుంది. “సినిమా చూసే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే మధ్య తరగతి భర్తగా ఈ చిత్రంలో నాగచైతన్య పూర్ణ అనే పాత్రలో కనపడతారు. ఈయన పాత్ర ఇన్టెన్స్గా, వైవిధ్యంగా ఉంటుంది. అలాగే సమంత అక్కినేని శ్రావణి అనే అమ్మాయిగా కనపడుతుంది. ఈమె తన నటనతో నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమాను వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించాం. ఇదొక ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. చైతు, సామ్ పాత్రలే సినిమాకు హైలైట్ అవుతాయి. సినిమాలో నటించిన మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుంది. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 5న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం“ అన్నారు దర్శకుడు శివ నిర్వాణ.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!