నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో చైతన్య,నిహారిక జంట ఒక్కటికానుంది. ఈ వేడుకలో మెగా, అల్లువారి కుటుంబాలు సందడి చేస్తున్నాయి. పెళ్ళికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో డాన్స్‌లతో అదరగొట్టి్ంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ స్టెప్పులతో అలరించారు. ముఖ్యంగా చిరు, అల్లు అర్జున్ ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు వేసిన స్టెప్లు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒకే వేదికపై రెండు కుటుంబాల సందడి చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ పాటకు చిరంజీవి సతీమణి కూడా స్టెప్పులు వేశారు. అలాగే అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ గడిపారు.
నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహంపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అక్కడి జరిగే ప్రతి హంగామాను చూడడానికి అత్రతు పడుతున్నారు. ఇక గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు నడవనున్నారు. మెగా హీరోలతో కలిసి కాబోయే దంపతులు సందడి చేస్తున్నారు. డాన్స్‌లతో ఇరగదిస్తున్నారు. వివాహం ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మెహందీ, హల్దీ ఫంక్షన్స్ ఘనంగా నిర్వహించారు. ఇక నిహారిక, చైతన్యల పెళ్లి తంతు అనుకున్న ముహుర్తానికి జరిగింది. పండితులు నిర్ణయించిన సమయంలో ఒకరికొకరు తలపై జీలకర్ర బెల్లం వారిద్దరిని ఒకటిచేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిహారిక పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ సహా హజరయ్యారు. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో ఈ వివాహానికి జరిగింది. ఈ వేడకకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు పినితారలు కూడా హాజరయ్యారు. నిహరిక పెళ్ళి మండపంలో సంప్రదాయ వస్త్రధారణలో అందంగా కనిపించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!