NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 20 2024 Episode 164: షాపింగ్ మాల్ కి వెళ్లిన ఖాళీ, అంజలి ఖాళీని గుర్తు పడుతుందని టెన్షన్ పడుతున్న మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

Nindu Noorella Saavasam February 20 2024 Episode 164: శివరామ్ మంగళ కి ఫోన్ చేసి బట్టలు కొనాలి షాపింగ్ మాల్ కి రండి అని  చెబుతాడు. అలాగేనండి తప్పకుండా వస్తాము అని మంగళ అంటుంది. వాళ్ళు బట్టలు షాపింగ్ చేస్తారంట మొహమాట పడకుండా అన్ని కొనుక్కోవాలి అని మంగళ అంటుంది. మనిద్దరం షాపింగ్ కి వెళ్తే బావ ఎలాగా అక్క అని ఖాళీ అంటాడు. ఆయనకు ఒక పట్టు పంచ ఒక షర్ట్ తీస్కొని వద్దాం  అని మంగళ అంటుంది. అది కాదక్కా బావ లేవని పరిస్థితి తన వెంట ఒక మనిషి ఉండాలి కదా ఏదైనా అవసరమైతే ఎలా అని ఖాళీ అంటాడు. అతను ఏమన్నా చిన్నపిల్లడా  కావాలంటే మనం వచ్చేదాకా ఉంటాడులే షాపింగ్ కి వెళ్లి రోజంతా అక్కడే ఉంటామా వచ్చేస్తాం కదా అని మంగళ అంటుంది. ఏమయ్యా మేము షాపింగ్ కి వెళ్ళొస్తాం జాగ్రత్తగా ఉండు అని మంగళ ఖాళీని తీసుకుని వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

కట్ చేస్తే,అమరేంద్ర సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. తన పక్కనే అరుంధతి కూర్చొని ఏమండీ మీరు భాగి పెళ్లి చేస్తున్నందుకు ఆనందించాలో మనోహరి వాళ్లు భాగికి ఇష్టం లేకుండా పెళ్లి ఒప్పించారని బాధపడలో ఏమీ అర్థం కావట్లేదు తన పెళ్లి జరుగుతుందని సంతోషించాలి అనుకుంటే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి అనిపిస్తుంది కానీ చెబితే ఇంటికి మంచి జరగదని గుప్తా గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతున్నాను నా కళ్ళముందే భాగి జీవితం అన్యాయమైపోతుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇంతలో భాగమతి అమరేంద్ర దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది. రా మిస్సమ్మ అని అమరేంద్ర అంటాడు. అయ్యో భాగి వచ్చింది తనకంట పడకుండా తప్పించుకోవాలి అని అరుంధతి పరిగెత్తుకెళ్ళి డోర్ వెనకాల నిలబడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

అపార్థం చేసుకున్న మీరు మళ్లీ పిలిచి నాకు పెళ్లి ఆనందంగా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు సార్ కారణం ఏంటి నాకు చెప్తారా అని భాగమతి అడుగుతుంది. ఇది నా బాధ్యత మిస్సమ్మ నీకు ఎటువంటి లోటు లేకుండా నీ పెళ్లి జరిపించాలి అని అమరేంద్ర అంటాడు. నేను చూస్తున్నది నిజమేనా మీ మాటలు కొత్తగా వినపడుతున్నాయి అని భాగమతి అంటుంది.అరుంధతి నీకు జీవితాంతం తోడు ఉంటానని మాట ఇచ్చింది భాగీ తను లేకపోయినా తను ఇచ్చిన మాట నేను పూర్తి చేస్తాను నీకు పెళ్లి అయ్యేదాకా ఈ విషయం చెప్పకూడదు అని అమరేంద్ర అనుకుంటాడు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నావు మిస్సమ్మ పెళ్లయిన తర్వాత చెప్తాను అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టాలి అనుకోవట్లేదు అని అమరేంద్ర అంటాడు.  పెళ్లి సింపుల్గా ఏ గుళ్లోనో జరిపించండి అని భాగమతి అంటుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకుంటావు మిస్సమ్మ ఖర్చు గురించి భయపడకు అన్నీ నేను చూసుకుంటాను పీఠల మీదికి సంతోషంగా వచ్చి తాళి కట్టించుకో చాలు అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

సరే మీ ఇష్టం అండి అని భాగమతి అంటుంది. షాపింగ్ కి వెళ్దాం వెళ్లి రెడీ అవ్వు మిస్సమ్మ అని అమరేంద్ర అంటాడు. భాగమతి వెళ్తూ ఉండగా ఏంటి మిస్సమ్మ అలా మాట్లాడుతున్నావ్ అని రాథోడ్ అంటాడు. పెళ్లి కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటున్నాను పెళ్లి ఎలా జరిగితే ఏముంది రాథోడ్ అని భాగమతి అంటుంది. అదేంటి మిస్సమ్మ నీకు పెళ్లి ఇష్టం లేదా అని రాథోడ్ అంటాడు. ఈ పెళ్లి నేను ఇష్టపడి సంతోషంగా చేసుకోవట్లేదు రాథోడ్ మా నాన్న కోసం రాజీ పడి చేసుకుంటున్నాను పెళ్లి ఎలా జరిగితే ఏముంది అని భాగమతి అంటుంది. అయితే ఈ విషయం సార్ కి చెప్తే సరిపోతుంది కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఎంతో సంతోషంతో నా పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఈ విషయం చెబితే బాధపడతారు చెప్పకు రాథోడ్ అని భాగమతి అంటుంది.భాగీ కళ్ళముందు నీ జీవితం నాశనం అవుతున్న ఏమీ చేయలేకపోతున్నాను అంతా విధిరాత అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, పిల్లలు త్వరగా రండి  షాపింగ్ టైం అవుతుంది అని శివరామ్ పిలుస్తాడు. పిల్లలు మిస్సమ్మ కిందికి వస్తారు. బయలుదేరుదామా మిస్సమ్మ అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

ఒక్క నిమిషం ఉండండి అంజలి పాప కూడా వస్తుంది అని భాగమతి అంటుంది. అంజలి కిందికి వస్తుంది ఇప్పుడు ఎలా ఖాళీని షాపింగ్ మాల్ లో చూస్తే నిజం చెప్పేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. అమర్ ఇప్పుడు అంజలి పాప షాపింగ్ కి ఎందుకు అని మనోహరి అంటుంది. ముగ్గురు వస్తున్నారు కాబట్టి తను కూడా వస్తుంది అని అమరేంద్ర అంటాడు. తను ఇప్పుడే కోలుకుంటుంది కదా అక్కడికి వస్తే అలసిపోతుంది తనకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని మనోహరి అంటుంది. అంజలి మిస్సమ్మని గట్టిగా పట్టుకుంటుంది. పర్వాలేదండి అంతగా తనకు ప్రాబ్లం అనిపిస్తే కార్లోనే కూర్చోబెడదాం చుట్టూ అందరం ఉంటాం కదా అని భాగమతి అంటుంది. మను ఎందుకే అలా అంటున్నావ్ మీరందరూ షాపింగ్ కి వెళ్తే అంజలి మాత్రం ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తుంది తీసుకువెళ్లండి అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 20 2024 Episode 164 Highlights

సరే వెళ్దాం పదండి అని అమరేంద్ర అంటాడు. అమర్ మీరు పదండి నేను వస్తాను అని మనోహరి తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మంగళకి ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే, ఈవిడ  ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది అని మంగళ అంటుంది. ఎందుకు చేస్తుందో ఏమో ఒకసారి ఫోన్ ఎత్తు అక్క అని ఖాళీ అంటాడు. ఏముందిరా మీకు తగ్గట్టు బట్టలు కొనుక్కోండి ఎక్కువ రేట్లు పోయి తీసుకోకండి అని చెబుతుంది వాళ్లు కొనిస్తుంటే ఏమికెందుకురా బాధ  బట్టలు సంవత్సరం దాకా సరిపోయేలా కొనుక్కో ఆ తర్వాత బట్టలు కావాలని నన్ను అడగవద్దు అని మంగళ అంటుంది. మనోహరి మళ్లీ మంగళకి ఫోన్ చేస్తుంది. ఒకసారి ఎత్తి మాట్లాడు అక్క ఏం అవసరం ఉందో అని కాళీ అంటాడు. వద్దులేరా షాపింగ్ మాల్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అని మంగళ అంటుంది. అక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అంటే ఏం సమాధానం చెప్తావ్ అక్క అని ఖాళీ అంటాడు. చూసుకో లేదు సైలెంట్ లో పడింది అని చెప్తాను  అని మంగళ తన ఫోన్ సైలెంట్ లో పెడుతుంది. కట్ చేస్తే, మనోహరి మేడం లేటవుతుంది త్వరగా రండి అని రాథోడ్ అంటాడు.

వస్తున్నా అంటూ మనోహరి వెళ్తుంది.కట్ చేస్తే,మంగళ వాళ్లు షాపింగ్ మాల్ లోకి వెళ్తారు.  అక్క షాపింగ్ జీవితంలో ఇలాంటి దాంట్లో బట్టలు కొనుక్కుంటానని అస్సలు అనుకోలేదు అని ఖాళీ అంటాడు. ఇంతలో షాపింగ్ మాల్ మేనేజర్ వచ్చి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. బట్టలు కొనుక్కోడానికి వచ్చాం అని మంగళ అంటుంది. మీరు కొనే బట్టలు ఇక్కడ లేవు బయటకు వెళ్ళండి అని అతను అంటాడు.ఇదిగో మేము బట్టలు కొనుక్కోడానికే వచ్చాం నాకు పట్టు చీరలు చూపించు మా తమ్ముడికి షూట్ చూయించు షాపింగ్ మేం చేస్తాం మా వెనకాల వచ్చే వాళ్ళు బిల్లు చేస్తారు అంటూ మంగళ వెళ్ళిపోతుంది. ఖాళీ సూట్ వేసుకొని అక్క ఎలా ఉన్నాను అని అడుగుతాడు. ఈ డ్రెస్ లో భాగి వచ్చి చూస్తే షాక్ అయిపోతుంది  నువ్వు ఇవి రెండు తీసుకో అని మంగళ అంటుంది. ఇంతలో అమరేంద్ర వాళ్ళు షాపింగ్ మాల్ కి వస్తారు. రాథోడ్ వాళ్లు షాపింగ్ మాల్ కి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ మంగళకి ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్ అని మంగళ ఫోన్ ఎత్తుతుంది. నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు కానీ రాథోడ్ చేస్తే ఎత్తింది చెప్తా దాని సంగతి అని మనోహరి అనుకుంటుంది. షాపింగ్ మాల్ లోనే ఉన్నాం సార్ అని మంగళ అంటుంది. మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను అని మంగళ అక్కడికి వస్తుంది.

మనోహర్ని చూసి భయపడుతూ ఉంటుంది మంగళ. అమ్మో ఈవిడ ఏంటి అలా చూస్తుంది చూపులతోటే చంపేసేలా ఉంది అని టెన్షన్ పడుతుంది మంగళ. నమస్తే సార్ అని మంగళ అంటుంది. నా కూతురు రాలేదా సార్ అని మంగళ అంటుంది. వచ్చింది మిస్సమ్మ రా అని అమరేంద్ర పిలుస్తాడు. భాగమతి చేయి పట్టుకొని అంజలి వస్తూ ఉండగా తనను చూసి షాక్ అయిపోయి పాప పాప అంటుంది. ఏంటి అలా టెన్షన్ పడుతూ అంజలి అంజలి అంటున్నారు అని అమరేంద్ర అంటాడు. అంటే పాపకి ఒంట్లో బాగోలేదు కదా అమర్ షాపింగ్ మాల్ కి ఎందుకు తీసుకువచ్చారు అని అంటుంది అని మనుహరి అంటుంది. ఏం పర్వాలేదులే రండి అంటూ అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్లిపోగానే అంజలిని చూసి షాక్ అయిపోయావా అది చెబుదామని ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని మనోహరి అంటుంది. ఫోన్ సైలెంట్ లో ఉంది అమ్మ చూసుకోలేదు అని మంగళ అంటుంది. దీని గురించి తర్వాత మాట్లాడుతాను పద అని మనోహరీ కోపంగా షాపింగ్ మాల్ లోకి వెళుతుంది. అంజలి భాగమతి చేయి పట్టుకుని లోపలికి వెళ్లి షాపింగ్ మాల్ అంతా చూస్తుంది. ఖాళీ అంజలి కంటపడకుండా చేయాలి అని ఆలోచిస్తుంది మనోహరి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella