NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌తో గత కొద్ది రోజుల నుంచీ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించగా.. ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్, శ్రియ, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. అనేక కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంటూ సూమారు నాలుగేళ్లపాటు ఈ మూవీని రూపొందించారు. యావత్ సినీ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో.. థియేటర్స్ వద్ద అభిమానులు హంగామా వేరె లేవల్లో కనిపిస్తోంది.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా నార్త్ ఇండియా మొత్తం చుట్టేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. బుధవారం నుంచి హైదరాబాద్ లో తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిలో ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఎన్టీఆర్‌ను యాంకర్.. `రామ్ చరణ్ తో కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ చేయడం, ఇద్దరు కొట్టుకోవడం మీకు ఎలా అనిపించింది..? `అంటూ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి ప్రశ్నించింది.
నార్త్‌లో సినిమాను ప్రమోట్ చేసి చేసి రెస్ట్ లేదో ఏమో కానీ.. యాంకర్ అడిన ప్రశ్నకు ఎన్టీఆర్ తెలుగు మరచిపోయి హిందీలో అన్సర్ ఇవ్వడం మొదలు పెట్టాడు. వెంటనే రాజమౌళి, చరణ్‌లు అందుకుని నార్త్ ఇండియా అయిపోయింది.. సౌత్.. ఇది హైదరాబాద్ అని గుర్తు చేశారు. వెంటనే మాఫ్ కర్ అని ఎన్టీఆర్ మళ్లీ హిందీలోనే మాట్లాడబోతుండగా తెలుగు.. తెలుగు అంటూ రాజమౌళి మళ్లీ గట్టిగా చెప్పాడు. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తూ నెట్టింట వైరల్‌గా మారింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!