NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 11 2024 Episode 173: అభిషేక్ ని చంపడానికి ప్లాన్ వేస్తున్న రవీంద్ర, గొప్ప లాయర్ కావాలి స్వర అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

Paluke Bangaramayenaa March 11 2024 Episode 173: ఏంటి స్వర ఇది నాకే ఇలాగ అనిపిస్తుందా నీకు కూడా అనిపిస్తుందా నువ్వు లేకపోతే నాకు ఏమీ తోచడం లేదు నిన్ను చూడడానికి వస్తే నువ్వు ఏమనుకుంటావో అని బిడియం కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను  ఏదో ఒకటి అడ్డుపెట్టుకొని వస్తున్నాను నిన్న మీ నాన్న ని చూడడం కోసం అని వచ్చాను ఆ తర్వాత బుక్స్ ని అడ్డం పెట్టుకొని వచ్చాను ఈరోజు నిన్ను చూడడానికి ఏం అడ్డం పెట్టుకొని రావాలి అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. స్వర నేను ఎందుకు వస్తున్నాను నీకు అర్థం అయి ఉంటుందా లేదంటే తెలిసినా నువ్వు తెలియ నట్టు ఉంటున్నావా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు నన్ను ఆటపాటిస్తున్నావా ఏ వంక పెట్టుకొని నిన్ను చూడడానికి రావాలి అని అభిషేక్ ఆలోచిస్తూ ఉండగా పోలీస్ బొమ్మ కనిపిస్తుంది ఈ బొమ్మ స్వరకి ఒకప్పుడు నేనే కొనిచ్చాను ఇప్పుడు స్వరకి దీన్ని తీసుకొని వెళ్లి ఇచ్చి చూసి రావాలి అని అభిషేక్ అనుకుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights
Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

కట్ చేస్తే,ఏంటి అభి సార్ ఇది నీ ఊహల్లోనే ఉంటున్నాను ఏ పని చేసుకో నివ్వట్లేదు అంతా నీ ధ్యాసే ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు నాకు మాత్రమే ఇలా ఉందా నీకు కూడా అలాగే ఉందా కానీ ఇదేదో చాలా బాగుంది అభి సార్ నన్ను చూడడం కోసమే మీరు ఇవన్నీ అడ్డుపెట్టుకొని వస్తున్నారని నాకు అర్థమైంది కానీ చెప్పడానికి మొహమాటపడుతున్నారు నా మీద ప్రేమ ఉందని చెప్పొచ్చు కదా అభి సార్ అని స్వర అనుకుంటూ ఉండగా అభిషేక్ వస్తాడు. స్వర నా గురించే ఆలోచిస్తున్నట్టుంది తను కూడా నన్ను ఇష్టపడుతున్నట్టు ఉంది కానీ చెప్పడం లేదు ఆట పట్టిద్దాం అని అభిషేక్ స్వర ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. అభి సార్ మీరా ఎప్పుడు వచ్చారు అని స్వర అంటుంది. ఇప్పుడే వచ్చాను స్వర కానీ నీకు ఈ పోలీస్ బొమ్మ అంటే ఇష్టం కదా ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అభిషేక్ ఆ బొమ్మని ఇస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights
Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

నిజం చెప్పండి సార్ నిజంగా ఈ బొమ్మని ఇవ్వడానికే మీరు వచ్చారా లేదంటే నన్ను చూడడానికి వచ్చారా అని స్వర అంటుంది. ఈ బొమ్మని ఇవ్వడానికే వచ్చాను స్వర అని అభిషేక్ అంటాడు. స్వర నికు ఈ బొమ్మంటే ఎందుకు అంత ఇష్టం అని అభిషేక్ అడుగుతాడు. ఎందుకంటే మీరు కూడా పోలిసే కదా సార్ అందుకే ఈ బొమ్మ అంటే నాకు ఇష్టం మీరిచ్చిన ధైర్యం తోటే నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్ అందుకే ఈ పోలీస్ బొమ్మంటే నాకు చాలా ఇష్టం అని స్వర చెప్పకనే తన ప్రేమని చెబుతుంది. అది అర్థం చేసుకున్న అభిషేక్ నవ్వుతూ ఉంటాడు. దేవుడా వాళ్ళిద్దరి మనసులో ప్రేమ ఉంది కానీ బయటపడడం లేదు ఎలాగో అలా వాళ్ల ప్రేమని బయటపడేలా చేయి స్వామి అని నాయుడు అనుకుంటాడు. కట్ చేస్తే, రవీంద్ర చందనాకి నిజం చెప్పాలని ఆలోచిస్తాడు. ఏంటి రవీంద్ర నాకేమైనా చెప్పాలా అని చందన అడుగుతుంది. అవును చందన అంటూ ఉండగా బాబ్జి ఫోన్ చేస్తాడు రవీంద్రా కి.

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights
Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

చూడు రవీంద్ర నేను ఇంతకుముందు మోసం చేసినట్టు ఇప్పుడు నిన్ను మోసం చేయను మా అక్క నీకు 10 కోట్లు ఇస్తానన్నది అంటే తప్పకుండా ఇచ్చి తీరుతుంది కానీ నువ్వు అభిషేక్ ని లేపేయాలి అని బాబ్జి అంటాడు. రవీంద్రా ఏమీ మాట్లాడకుండా  ఓకే అని ఫోన్ కట్ చేస్తాడు.ఏంటిబాబ్జితో మళ్ళీ చేతులు కలుపుతున్నావా అతను ఎలాంటివాడు నీకు తెలుసు కదా అని చందన అంటుంది. బంగారం బాబ్జి ఎలాంటి వాడో మనకు తెలుసు కానీ పని చెప్పింది ఎవరు  వైజయంతి మేడం మీ అన్నయ్యని చంపేస్తే 10 కోట్లు ఇస్తానన్నది అని రవీంద్ర చెబుతాడు. ఏంటి మా అన్నయ్యని చంపేస్తారా అని చందన అంటుంది. చూడు చందన ఆయన ఏమన్నా మీ సొంత అన్నయ్య అంత ఎమోషన్ అయిపోతున్నావ్ సవతి తల్లి కొడుకే కదా 10 కోట్లు కావాలా మీ అన్నయ్య కావాలా అని రవీంద్ర అంటాడు. నాకు అన్నయ్య కన్నా 10 కోట్లే కావాలి అని చందన అంటుంది. కట్ చేస్తే, అభిషేక్ మళ్లీ తన పర్సు పట్టుకుని స్వరని చూడడానికి ఇంటికి వస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights
Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

ఇదిస్తే స్వర ఏమనుకుంటుందో అనుకుంటూ వీడియో పడుతూ వెళ్తాడు అభిషేక్. అభి మనసులో ప్రేమ ఉంది కానీ చెప్పడం లేదు వాళ్ళిద్దరికీ తొందరలో పెళ్లి చేసేయాలి అని నాయుడు అనుకుంటాడు.సార్ స్వర ఈపర్సు మరిచిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అభిషేక్ అంటాడు.ఇంతలో స్వర వచ్చి అభి సార్ మీరేంటి లా అని అడుగుతుంది. నీ పర్సు మర్చిపోయావ్ స్వర ఆడవాళ్ళకి అందులో బొట్టు బిల్లలు చాలా ఇంపార్టెన్స్ వస్తువులు ఉంటాయి కదా అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అభిషేక్ అంటాడు. నాకోసం వచ్చిన బయటపడట్లేదా సార్ మీరు ఉండండి మీ పని చెప్తా అని స్వర నిజంగా ఈ పర్సు ఇవ్వడానికే వచ్చారా సార్ ఇంకా నేను నా సిలబస్ ఏమైనా మిస్ అవుతున్నానేమో బాగా చదువుతున్నాను లేదు అని చూసి వెళ్దామని వచ్చారనుకున్నాను అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights
Paluke Bangaramayenaa Today Episode March 11 2024 Episode 173 highlights

పర్సు మీ ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ కదా స్వర అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు బాగా చదువుకొని గొప్ప లాయర్ వి కావాలి ఈరోజుల్లో లాయర్ అంటేనే అవినీతిపరులు అనుకుంటున్నారు కానీ నిన్ను చూసి అందరూ గర్వపడేలా చేయాలి సత్యమేవ జయతే అనే పదానికి నువ్వే అర్థం చూపెట్టాలి వందమంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మాటని నువ్వు నిజం చేయాలి అని అభిషేక్ అంటాడు. నేను నిజంగా లాయర్ అయితే మీరు సంతోషిస్తానంటే నేను నిజంగానే బాగా చదివి లాయర్ అవుతాను సార్ నా నత్తిని కూడా మర్చిపోయేలా వాదించి ధర్మాన్ని నిలబెడతాను అని స్వర అంటుంది. గుడ్ స్వర అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N