NewsOrbit
Telugu Cinema సినిమా

Megastar Chiranjeevi : మెగాస్టార్ కెరీర్ కు ‘పునాదిరాళ్లు’ వేసింది ఎవరు? అతనికి చిరంజీవి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటి?

Person behind Chiranjeevi's life milestone, how Chiranjeevi returned their help

Megastar Chiranjeevi : ఇటీవలే గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇండియా-2022 పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎక్కని ఎత్తులు లేవు అన్నది నిర్వివాదాంశం. స్వయంకృషితోనే ఆయన అనితర సాధ్యమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 67 ఏళ్ల వయసులో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్రౌడ్ పుల్లర్ గా చిరంజీవి తన సత్తా చాటుకుంటున్నారు. మెగాస్టార్ సాధించిన విజయాలు,సృష్టించిన రికార్డులు,అందుకున్న అవార్డుల గురించి అందరికీ తెలుసు.వాటి గురించి రాయడం చర్విత చరణమే అవుతుంది. సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్టు బి కే ఈశ్వర్ చిరంజీవి మూవీ కెరీర్ ఎలా ప్రారంభమైందో ఈమధ్య ఒక వీడియో కథనంలో తెలిపారు. అందులోని ప్రధాని అంశం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది.

Person behind Chiranjeevi's life milestone, how Chiranjeevi returned their help
Person behind Chiranjeevi’s life milestone, how Chiranjeevi returned their help

చిరంజీవిని పల్లకీ ఎక్కించింది వాళ్ళెవరూ కాదు!

అల్లు రామలింగయ్య అల్లుడు కావటం, అల్లు అరవింద్ ప్లానింగ్ తోడు కావడం, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుల చేతిలో పడడం వంటి కారణాల వల్ల చిరంజీవి మెగాస్టార్ అయిపోయారు అన్నది బయటి ప్రపంచం చెప్పుకునే మాట. అసలు వాస్తవం ఏమిటంటే చిరంజీవి పల్లకికి వారంతా బోయీలు మాత్రమే అని ఈశ్వర్ తెలిపారు.

Person behind Chiranjeevi's life milestone, how Chiranjeevi returned their help
Person behind Chiranjeevi’s life milestone, how Chiranjeevi returned their help

ఆ ఘనత అంతా ఆ కామెడీ స్టార్ దే!

చిరంజీవి సినీ రంగ ప్రవేశం వెనక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని ఈశ్వర్ బయట పెట్టారు. చిరంజీవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతుడైన కామెడీ స్టార్ సుధాకర్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఒక వెలుగు వెలిగి హఠాన్మరణం చెందిన హీరో హరి ప్రసాద్ ఒకే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు. ఆ తదుపరి ఎవరికి వారు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో ముందుగా సుధాకర్ కు పునాదిరాళ్లు చిత్రంలో ఓ పాత్ర లభించింది. అయితే అదే సమయంలో సుధాకర్ కు తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో కూడా అవకాశం వచ్చింది. భారతీ రాజాకు అప్పటికే పేరు ప్రఖ్యాతలు ఉండడంతో సుధాకర్ ఆ తమిళ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడు.

Person behind Chiranjeevi's life milestone, how Chiranjeevi returned their help
Person behind Chiranjeevi’s life milestone, how Chiranjeevi returned their help

ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇదే విషయాన్ని పునాదిరాళ్లు దర్శకుడు రాజకుమార్ కు చెప్పటానికి సుధాకర్ అక్కడికి వెళ్ళగా ఆ సమయంలో చిరంజీవి అక్కడే ఉన్నారు. రాజకుమార్ కు విషయమంతా చెప్పేసిన సుధాకర్ అంతటితో ఆగలేదు.తనకు ఇస్తానన్న పాత్రనుచిరంజీవికి ఇవ్వవలసిందిగా దర్శకుడు రాజకుమార్ కు సుధాకర్ సూచించారు.ఆ తర్వాత ఆడిషన్స్ పెట్టి చిరంజీవికి ఆ పాత్రను దర్శకుడు రాజకుమార్ పునాదిరాళ్లు చిత్రంలో ఇచ్చాడు.ఆ తర్వాత తన ప్రతిభతో రాణించివ చిరంజీవి ఇక వెను తిరిగి చూసుకోలేదన్నది చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ కు ఊపిరి లూదింది ఈ కామెడీ స్టార్ సుధాకరే!

Person behind Chiranjeevi's life milestone, how Chiranjeevi returned their help
Person behind Chiranjeevi’s life milestone, how Chiranjeevi returned their help
స్నేహ ధర్మం పాటించిన చిరంజీవి!

అయితే చిరంజీవి కూడా తన ఫిలిం ఇన్స్టిట్యూట్ మిత్రులైన సుధాకర్ హరిప్రసాద్ మరో స్నేహితుడు నారాయణరావు లను విస్మరించలేదు.తానో పెద్ద స్టార్ గా మారిపోయాక ఆ ముగ్గురు స్నేహితులకు తనతో ఒక సినిమా చేసుకోమని ఆఫర్ ఇవ్వగా వారు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి తో యముడికి మొగుడు అనే సినిమా నిర్మించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయి కనక వర్షం కురిపించింది.తద్వారా మిత్రులకు చిరంజీవి లాభాలు చేకూర్చి పెట్టారని ఈశ్వర్ వివరించారు.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu