Prabash – pooja: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. పూజా హెగ్డేతో కలిసి ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం నేడు విడుదలైంది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చక్కగా కుదిరిందనే అభిప్రాయాలు ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచి వస్తున్నాయి. ప్రేరణగా పూజ, విక్రమాదిత్యగా ప్రభాస్ తమ నటనతో రాధేశ్యామ్ చిత్రంలో అలరించారు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రమోషన్స్‌ను విపరీతంగా చేశారు చిత్ర యూనిట్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా అన్నింటా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో ప్రభాస్ ఎక్కడా పూజను పొగడకపోవడం, ఆమె ప్రస్తావనే తీసుకు రాకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
Prabhas: నాది లవ్ మ్యారేజే..కన్ఫర్మ్ చేసిన ప్రభాస్..!
Prabash – pooja: అసలు గొడవ ఎక్కడొచ్చింది?
పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ రేంజి ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉంది. బాహుబలి తర్వాత విడుదలైన సాహో చిత్రం హిందీలో కాసుల వర్షం కురిపించింది. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుం సౌత్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్గా నిలుస్తోంది. ఏదైనా భారీ సినిమా అనుకుంటే హీరోయిన్గా పూజ ఉండాల్సిందేనని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అంతలా ఆమె క్రేజ్ పెరిగింది. తమిళంలో హీరో విజయ్ సరసన బీస్ట్, తెలుగులో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోనూ ఆమె హీరోయిన్గా ఉంది. ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్‌తో ఆమె నటించిన రాధేశ్యామ్ విడుదలకు ముందే అంచనాలను పెంచేసింది. అయితే ప్రచారంలో ఎక్కడా పూజ పేరును ప్రభాస్ ప్రస్తావించకపోవడంతో ఏదో జరిగే ఉంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Prabhas : డార్లింగ్ అభిమానులారా మీవాడిమీద ఓ కన్నేయండి… సినిమా రిలీజుకి ముందే ప్రభాస్ అక్కడికి చెక్కేస్తున్నాడట!
*విభేదాలు వాస్తవమేనా..*
పలు ప్రమోషన్స్‌లో ప్రభాస్ పక్కన పూజ కూర్చున్నా, వారిద్దరి తీరు చూసి ఏవో విభేదాలున్నాయనే ప్రచారం సాగింది. దీనిని బలపరిచేలా ప్రభాస్ ఎక్కడా ఆమె పేరు ఎత్తలేదు. దర్శకుడిని, నిర్మాతను, టెక్నీషియన్లను చాలా సందర్భాల్లో ఆకాశానికెత్తేశాడు ప్రభాస్. అయితే ఎక్కడా పూజ పేరు ప్రస్తావించలేదు. తాజాగా రాజమౌళితో ప్రభాస్ చేసిన ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది. అందులో కూడా పూజ ప్రస్తావన అస్సలు తీసుకు రాలేదు. దీంతో వారిద్దరికీ విభేదాలు వచ్చాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వీటిని పూజ హెగ్డే కొట్టి పారేసింది. అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ప్రభాస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఇంకా రాలేదు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!