డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ ఏడాది విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దీంతోడైరెక్టర్గా పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ క్రమంలో చార్మి, పూరి డైరెక్షన్ టీమ్, సెప్టెంబర్ 28న డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. అందులో భాగంగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ సినిమా కోసం కష్టపడి పనిచేసి సినిమానే లోకంగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న 20 కో డైరెక్టర్స్‌కు ఆర్థిక సాయం చేయనున్నారు. దేవుడు శక్తినిస్తే.. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చార్మి తెలిపారు.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!