NewsOrbit
న్యూస్ సినిమా

Radheshyam: అమితాబ్ మాత్రమే కాదు ప్రభాస్ కోసం వాళ్ళందరూ వచ్చేస్తున్నారు..

Radheshyam: అమితాబ్ మాత్రమే కాదు ప్రభాస్ కోసం వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అవును ఈ సినిమా కోసం సౌత్ స్టార్స్ అందరూ బయలుదేరుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి ఇంత వరకు మరో మూవీ రాలేదు. అది కూడా రొమాంటిక్ లవ్ స్టోరి. పదేళ్ళైంది ప్రభాస్ నుంచి కంప్లీట్ లవ్ స్టోరి రాలేదు. డెస్టినీకి ప్రేమకు మధ్య సాగే అద్భుతమైన రొమాంటిక్ ప్రేమ కథగా రాధే శ్యామ్ సినిమాని యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్ నిర్మించగా, టీ సిరీస్ సహ నిర్మాతగా వ్యవహరించింది.

radheshyam-south stars voice over for prabhas
radheshyam-south stars voice over for prabhas

కృష్ణం రాజు సమర్పించారు. ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. ఎన్నో ప్రత్యేకతలతో మార్చి 11న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అలాగే,  చైనీస్, జపనీస్ ఒకేసారి విడుదల కాబోతోంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పిరియాడిక్ డ్రామాగా రూపొందించారు. ఇక ఇందులో ప్రభాస్ పెదనాన్న కీలక పాత్రల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ నటించారు. ప్రభాస్ పామిస్ట్ (హస్తసాముద్రిక నిపుణుడు)గా నటిస్తుండటం విశేషం.

Radheshyam: ప్రభాస్ మీద అభిమానంతోనే వీరందరూ మేకర్స్ అడగగానే ఒప్పుకున్నారట.

అయితే, ఈ సినిమా కోసం ‘రాధేశ్యామ్’ మూవీ మేకర్స్ క్రేజ్ స్టార్స్‌ను రంగంలోకి దింపేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారు. అలాగే, కన్నడ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించేందుకు రాఖీ భాయ్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక తమిళ వెర్షన్‌కు గానూ హీరో సూర్య వాయిస్ అందించనున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో మలయాళంలో మోహన్ లాల్ గానీ, ఆయన తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక మన తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు గానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానీ ‘రాధేశ్యామ్’ కథని నరేట్ చేసే బాధ్యతల్ని తీసుకున్నారట. ప్రభాస్ మీద అభిమానంతోనే వీరందరూ మేకర్స్ అడగగానే ఒప్పుకున్నారట.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?