నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ బాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమానే `లక్ష్మీ బాంబ్` అనే పేరుతో హిందీలో రీమేక్ చేయడానికి లారెన్స్ రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ స్టార్ట్ అయ్యింది. ప్రారంభంలోనే తనకు మర్యాద ఇవ్వలేదని, తన పర్మిషన్ లేకుండా ఫస్ట్ లుక్ విడుదల చేసేశారని కోపంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటన్నట్లు ప్రకటించాడు. దాంతో బాలీవుడ్ నిర్మాతలు, అక్షయ్ కుమార్ లారెన్స్‌ను చెన్నైలో ప్రత్యేకంగా కలిసి కన్విన్స్ చేశారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో లారెన్స్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఆ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు కూడా.వివాదాన్ని పరిస్కరించడంలో సహాయపడ్డ అక్షయ్‌కుమార్, నిర్మాతలకు ఈ సందర్భంగా లారెన్స్ థాంక్స్ చెప్పారు.
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!