NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

Rana Daggubati : రానా ఆ ధైర్యమేమిటోయ్..!? నువ్వు హీరోవి కాదు నటుడివి – హీరోలు చదవాల్సిన నటుడివి..!!

Rana Daggubati : Is an actor to be study by Heros

Rana Daggubati : పదకొండేళ్ల కిందట ఆరు అడుగుల రెండున్నర అంగుళాల ఎత్తున్న ఓ కుర్రాడు హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. తెలుగు సినీ తెరపై యాభై ఏళ్లుగా నిలదొక్కుకున్న ఓ పెద్ద ఫ్యామిలీకి వారసుడు..! ఓ బ్రాండ్ కి మనవడు, ఓ బ్రాండ్ ప్రొడ్యూసర్ కి కొడుకు, ఓ స్టార్ హీరోకి అన్న కొడుకు. బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉంది.. దానికి అదనంగా భారీ ఎత్తు, వారసత్వం, సూటిగా మాట్లాడే కంఠం… వెరసి ఇక తెలుగు సినిమాకి మరో స్టార్ హీరో దొరికినట్టే అనుకుంది సినీ లోకం..! కానీ ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ కుర్రాడు ఇప్పటికీ స్టార్ హీరో కాలేదు. కానీ స్టార్ నటుడయ్యాడు. తెలుగు సినీ స్టార్ హీరోలకు ఎవ్వరికీ అందని నటుడిగా ఎదుగుతున్నాడు. కమర్షియల్ ఫార్ములాలో కొట్టుకుని.., గింజుకుని.., హిట్లు, ఫ్లాపులతో డబ్బులెక్కేంటుకుంటున్న స్టార్ హీరోలకు అందనంత ఎత్తుకి వెళ్ళిపోతున్నాడు..! అతనే దగ్గుబాటి రానా..!!

Rana Daggubati : Is an actor to be study by Heros
Rana Daggubati : Is an actor to be study by Heros

Rana Daggubati : విలక్షణ.. పరిపూర్ణ “అరణ్య”..!!

ఈరోజు అరణ్య సినిమా విడుదలయింది. సినిమా కమర్షియల్ గా పోతే పోవచ్చు. ఉంటే ఉండొచ్చు. కానీ రానా మరో రూపం మాత్రం చూడొచ్చు. అడవిలో పెరిగిన.., అడవి జంతువుల మనసెరిగిన.., అడవి కోసం పోరాడిన.. అర మనిషి, అర అడవి మనిషి, అర జంతు లక్షణాలతో విలక్షణ హావభావాలను పండించారు. సినిమా మొత్తాన్ని భుజాన మోశారు. ఉద్రేకం, ఉద్వేగం కలిసిన హావభావాలతో రక్తి కట్టించారు. పరిపూర్ణ నటుడు ఇలా ఉండాలని తెరకి పరిచయం చేశారు. సినిమా ఒక డాక్యూమెంటరీలా ఉంటుంది. ఒక సందేశాత్మక సాదాసీదా సినిమాగా ఉంటుంది. కథ, కథనం ముందే ఊహించేయొచ్చు. అవన్నీ దర్శకుడి లోపాలు..! కానీ సినిమాలో ప్రధాన పాత్రధారిగా… సినిమా మొత్తం తన పాత్రపై ఆధారపడేలా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిన రానాకీ మాత్రం జేజేలు పలకాల్సిందే. సాధారణ కమర్షియల్ సినిమాలైతే హీరో ఎంతటి స్టార్ అయినా పదే పదే మొహం చూడాలంటే విసుగొస్తుంది. అందుకే దర్శకులు కూడా ఫైట్లు, పాటలు, హీరోయిన్ అందాలు, విలనిజం అంటూ రకరకాల ప్రయుక్తులు వేస్తారు. కానీ “అరణ్య” అలా కాదు. రానాని చూడడానికి ప్రేక్షకులకు విసుగు రాదు, రానాని అలా చూపడానికి సినీ యూనిట్ కి విసుగు రాదు..!!

Rana Daggubati : Is an actor to be study by Heros
Rana Daggubati : Is an actor to be study by Heros

అడుగడుగు ప్రత్యేకతతో..!!

లీడర్ మొదటి సినిమా. కమర్షియల్ కానీ.., యూత్ సందేశం.. ఆ తర్వాత నా ఇష్టం, నేను నా రాక్షసి అంటూ దర్శకులు నాశనం చేసిన సినిమాలు చేసినప్పటికీ… ఆ తర్వాత “కృష్ణం వందే జగద్గురుమ్” వంటి భిన్న కథాంశంతో రానా మళ్ళీ తెరపై మెరిశారు. ఆ తర్వాత “ఆరంభం”లో తమిళ నటుడు అజిత్ తో కలిసి.. ఆ పై బాహుబలితో ప్రభాస్ తో కలిసి మెప్పించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర ప్రాధాన్యం ఉంటే ఉండొచ్చు… కానీ నటనకు ఎక్కువ స్కోప్ ఉన్నదీ, నటించి మెప్పించాల్సిన పాత్ర మాత్రం రానాదే. ఆ పాత్రకి నూటికి నూరు శాతం రానా న్యాయం చేశారు. మధ్యలో ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి భిన్న అంశాలతో మెప్పించారు. ఇప్పుడు అరణ్య.. తర్వాత రాబోతున్న విరాటపర్వం లో కూడా అడవిబిడ్డ గానె నటించబోతున్నారు..! సో.. రానాకు కావాల్సింది స్టార్ హోదా కాదు.. మంచి నటుడు అనే పేరు. ఏ పాత్రనైనా చేయగలను అనే సవాల్. అందుకే ఆయన స్టార్ హీరో కాదు.. స్టార్ హీరోలు సైతం చదవాల్సిన నటుడు..!!

                                                                    – శ్రీనివాస్ మానెం, జర్నలిస్ట్

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu