మే 21 వ తారీఖున టాలీవుడ్ హ్యాండ్నమ్ హంక్ రానా దగ్గుబాటి తన కాబోయే భార్య మిహిక బజాజ్ తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకునే విషయం తెలిసిందే. వారిద్దరి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి రానా అధికారికంగా వెల్లడించింది కూడా ఆరోజే. అయితే వీరిద్దరి పెళ్లి లాక్ డౌన్ సంపూర్ణంగా తొలగించిన తర్వాత ఉంటుంది అని అనుకున్నారు కానీ త్వరలోనే మరొక తెలుగు ఇండస్ట్రీ ప్రముఖుడు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.
రానా దగ్గుబాటి మరియు మిహిక బజాజ్ ఆగస్టు 8 వ తేదీన పెళ్లి చేసుకోనున్నారని రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు. ఈ పెళ్లి కోవిడ్-19 నిబంధనల ప్రకారమే జరుగుతుందని సురేష్ బాబు వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన డెకరేషన్ మరియు డిజైనింగ్ సురేష్ బాబుకి తనకు కాబోయే కోడలు మిహిక బజాజ్ చూసుకుంటుంది. ఆమెకు యూనివర్సిటీ నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది.
ఇకపోతే వీరిరువురి పెళ్లి ఫలక్నామా ప్యాలెస్ లో జరుగుతుందని వార్తలు బయటకు వచేశాయి. సంప్రదాయమైన హిందూ పద్ధతిలో వీరి పెళ్లి జరగనుంది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత యొక్క పెండ్లి మరియు తమిళ హీరో ఆర్య-సయేషా సైగల్ యొక్క పెళ్లి కూడా ఫలక్నామా ప్యాలెస్ లోనే జరగడం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!