నువ్వెంతంటే నువ్వెంత అని నేటి తరం భార్యభర్తలు అనుకుంటున్న నేటి రోజుల్లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనెలను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాలు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్.. హీరోయిన్ దీపికా పదుకొనె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ అనోన్యంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతున్నారు. రీసెంట్గా ఓ పెళ్లికి రణవీర్, దీపికా జంటగా హాజరయ్యారు. అక్కడ దీపికా జోళ్లు తెగిపోయాయి. వాటిని రణవీర్ సింగ్ తన చేతుల్లోకి తీసుకుని మోశాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
previous post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!