రానా దగ్గుబాటికి సాయిపల్లవి ఛాలెంజ్ విసిరారు. ఇంతకు సాయిపల్లవి..రానాకు ఎందు ఛాలెంజ్ విసిరింది? అని చూస్తే.. ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. అందులో భాగంగా వారు మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుడు సంతోష్ అఖిల్, వరుణ్‌లకు ఛాలెంజ్ విసిరాడు. అందులో భాగంగా మొక్కలు నాటిన వరుణ్ సాయిపల్లవికి ఛాలెంజ్ విసిరాడు. సాయిపల్లవి .. ఛాలెంజ్‌ను స్వీకరించి ఇంటి ఆవరణలో మొక్క నాటింది. ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. రానా దగ్గుబాటి, సమంతకు ఛాలెంజ్ విసిరారు. ఇందులో ముందుగా రానా స్పందించారు. `సరే! బాస్` అంటూ రిప్లై ఇచ్చారు.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!